Mega 157 : చిరంజీవికి జోడిగా అనుష్క.. సెట్ చేస్తున్న యూవీ క్రియేషన్స్.. నిజమేనా..?
మెగా 157లో చిరంజీవికి జోడిగా అనుష్క నటించబోతుందట. యూవీ క్రియేషన్స్ ఈ కాంబినేషన్‌ని..

Anushka Shetty is heroine in Chiranjeevi Mega157 movie
Mega 157 : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 157వ సినిమా పై రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కబోతున్న ఈ మూవీ పై అభిమానుల్లో మంచి క్రేజ్ నెలకుంది. కాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇటీవలే మొదలయ్యాయి. శరవేగంగా ఆ పనులు పూర్తి చేసి నవంబర్ నుంచి ఈ మూవీని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Anasuya Bharadwaj : నన్ను ద్వేషించేవారికి ఓ సందేశం.. అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్
ఇది ఇలా ఉంటే, ఈ మూవీలో హీరోయిన్ గా పలానా యాక్ట్రెస్ సెలెక్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఒక పేరు గట్టిగా వినిపిస్తుంది. రీసెంట్ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్టుని అందుకున్న అనుష్క (Anushka Shetty) ని చిరంజీవికి జోడిగా తీసుకోవాలని మూవీ టీం ఆలోచిస్తుందట. ఈ విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పగా.. ఆయన కూడా ఒకే అన్నట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ లోకి అనుష్క ఎంట్రీ ఇస్తుందా..? లేదా..? చూడాలి.
Anil Sunkara : ‘భోళాశంకర్’ నిర్మాత అనిల్ సుంకర పై క్రిమినల్ కేసు.. కొనసాగుతున్న ‘ఏజెంట్’ పంచాయతీ..
కాగా చిరంజీవి, అనుష్క కలిసి స్టాలిన్ మూవీలో ఒక సాంగ్ కనిపించడం తప్ప హీరోహీరోయిన్లుగా ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీంతో ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీకి పని చేయబోయే టెక్నీషియన్స్ అండ్ నటీనటులు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చిరంజీవి నుంచి రీసెంట్ గా వచ్చిన భోళాశంకర్ అభిమానులను నిరాశ పర్చడంతో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.