Anushka Shetty : మహిళల కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రత్యేక షో.. ఎప్పుడంటే?

హీరోయిన్ అనుష్క ఆడవారి కోసం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రత్యేక షోలు వేయిస్తుంది.

Anushka Shetty : మహిళల కోసం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రత్యేక షో.. ఎప్పుడంటే?

Anushka Shetty Miss Shetty Mr Polishetty special shows for ladies only

Updated On : September 12, 2023 / 5:48 PM IST

Anushka Shetty Video : అనుష్క శెట్టి, న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అనుష్క ఒక ఫేమస్ మాస్టర్ చెఫ్ పాత్రలో, నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో నటించారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. థియేటర్స్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది.

The Vaccine War : ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ రిలీజ్.. కరోనా పై భారత్ పోరాటం..

ముఖ్యంగా యూఎస్ ఆడియన్స్ ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 1M డాలర్స్ అందించి సినిమాని సూపర్ హిట్ దిశగా తీసుకు వెళ్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వస్తుంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ఈ గురువారం ప్రత్యేక షో వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి అనుష్క స్వయంగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది. సినిమాని ఆదరిస్తునందుకు అందరికి థాంక్యూ చెప్పింది.

Mark Antony : మళ్ళీ పుట్టిన ‘సిల్క్ స్మిత’.. మార్క్ ఆంటోని చిత్రంతో ఎంట్రీ..

ఇక ఆంధ్రా అండ్ తెలంగాణలో కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్స్ లో ఆడవాళ్ళకి మాత్రం అనుష్క ప్రత్యేక షో వేయిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన థియేటర్స్ లిస్ట్ ని కూడా రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమా విజయంతో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్లు అయ్యింది. ఏజెంట్ సాయి శ్రీనివాస, జాతిరత్నాలు, ఇప్పుడు ఈ చిత్రంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు.