Anushka Shetty : అనుష్క నెక్స్ట్ సినిమా అప్డేట్.. హరిహర వీరమల్లు వదిలేసి అనుష్క సినిమాతో క్రిష్ బిజీ..

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఘాటీ ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Anushka Shetty : అనుష్క నెక్స్ట్ సినిమా అప్డేట్.. హరిహర వీరమల్లు వదిలేసి అనుష్క సినిమాతో క్రిష్ బిజీ..

Anushka Shetty Next Movie Ghaati Under Krish Direction Update

Updated On : November 4, 2024 / 4:03 PM IST

Anushka Shetty : ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన అనుష్క బాహుబలి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత సంవత్సరం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చి మెప్పించిన అనుష్క త్వరలో ఘాటీ సినిమాతో రాబోతుంది.

Also Read : Vidudala 2 : విడుదల పార్ట్ 2 తెలుగులో కూడా తమిళ్ తో పాటే రిలీజ్.. ఈసారి పార్ట్ 1ని మించి..

కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఘాటీ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు. అనుష్క పుట్టిన రోజు నవంబర్ 7 కావడంతో ఆ రోజు అనుష్క ఘాటీ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్.

అలాగే ఈ ఘాటీ షూటింగ్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందని ప్రకటించారు. దీంతో స్వీటీ ఫ్యాన్స్ ఘాటీ సినిమా అప్డేట్ కోసం, అనుష్క పుట్టిన రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఘాటీ కూడా పీరియాడిక్ సినిమా అని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు దర్శకుడిగా పనిచేసిన డైరెక్టర్ క్రిష్ అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అలా హరిహర వీరమల్లు వదిలేసి క్రిష్ అనుష్క ఘాటీ సినిమాతో బిజీగా ఉన్నాడు.