Vidudala 2 : విడుదల పార్ట్ 2 తెలుగులో కూడా తమిళ్ తో పాటే రిలీజ్.. ఈసారి పార్ట్ 1ని మించి..
ఇప్పుడు పార్ట్ 2 మాత్రం రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

Vijay Sethupathi Vidudala Part 2 Movie Released in Telugu by Producer Chinthapalli Ramarao
Vidudala 2 : తమిళ్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన విడుదల సినిమా సంచలన విజయం సాధించింది. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా హిట్ అయింది. అప్పుడే ఈ సినిమాకు పార్ట్ 2 ప్రకటించారు. ఇటీవల విడుదల పార్ట్ 2 రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.
Also Read : EeSaraina : ‘ఈ సారైనా’ ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
అయితే విడుదల సినిమా ఆ సమయంలో ముందు తమిళ్ లో రిలీజయి హిట్ టాక్ తెచ్చుకున్నాక తర్వాత తెలుగులో రిలీజ్ చేసారు. కానీ ఇప్పుడు పార్ట్ 2 మాత్రం రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. విడుదల 2 సినిమా డిసెంబర్ 20 న రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత చింతపల్లి రామారావు రిలీజ్ చేస్తున్నారు. పలువురితో పోటీ పడి మరీ ఫాన్సీ రేట్ తో ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్నారు నిర్మాత చింతపల్లి రామారావు.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. విడుదల 2 సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్ గా ఉండబోతుంది. ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన ఏకైక దర్శకుడు వెట్రి మారన్. ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు అని అన్నారు. మరి విడుదల పార్ట్ 2 సినిమా పార్ట్ 1 ని మించి ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.