Anushka: కృష్ణంరాజు గారి చివరి క్షణాల్లో పక్కనే ఉన్న అనుష్క.. వైరల్ అవుతున్న వీడియో!

కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఈ ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ శనివారం(సెప్టెంబర్ 10) కృష్ణంరాజు పెద్ద అమ్మాయి ఉప్పలపాటి ప్రసీధ జన్మదినం వేడుకల్లో పాల్గోన్న ఆయన, కొంత అస్వస్థకు గురవ్వడంతో.. గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చేరిపించారు. ప్రభాస్ కూడా అక్కడకి హుటాహుటిన చేరుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ అనుష్క కూడా..

Anushka: కృష్ణంరాజు గారి చివరి క్షణాల్లో పక్కనే ఉన్న అనుష్క.. వైరల్ అవుతున్న వీడియో!

Anushka was by Krishna Raju's last moments

Updated On : September 12, 2022 / 5:41 PM IST

Anushka: నటుడిగా, సహ-నటుడిగా, సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా.. వెండితెరపై ‘187’కు పైగా చిత్రాల్లో నటించిన నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. నటుడిగానే కాకుండా సినీ నిర్మాతగా, రాజకీయనేతగా కూడా వ్యవహరించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఈ ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Krishnam Raju: క్షత్రియ సంప్రదాయ పద్దతిలో ముగిసిన కృష్ణంరాజు గారి అంత్యక్రియలు..

ఈ శనివారం(సెప్టెంబర్ 10) కృష్ణంరాజు పెద్ద అమ్మాయి ఉప్పలపాటి ప్రసీధ జన్మదినం వేడుకల్లో పాల్గోన్న ఆయన, కొంత అస్వస్థకు గురవ్వడంతో.. గచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చేరిపించారు. ప్రభాస్ కూడా అక్కడకి హుటాహుటిన చేరుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ అనుష్క కూడా విషయం తెలుసుకొని హాస్పిటల్ కి చేరుకుంది అంటూ ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ప్రభాస్ తో చాలా సినిమాల్లో నటించిన అనుష్కకి కృష్ణంరాజు గారితో పాటు ప్రభాస్ కుటుంబంతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న వెంటనే ఆమె కృష్ణంరాజు గారిని చూసేందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తరవాత అనుష్క సోషల్ మీడియా వేదికగా ఆయన మరణానికి చింతిస్తూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.