AP Cinematography Minister Kandula Durgesh Meets Hero Ram Pothineni in RAPO 22 Shooting Spot
Ram Pothineni : హీరో రామ్ ప్రస్తుతం తన 22వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. గత కొన్నాళ్ళు మాస్ సినిమాలు తీసిన రామ్ ఇప్పుడు మళ్ళీ తన పాత స్టైల్ లోకి వచ్చి చాక్లెట్ బాయ్ లా మారాడు.
Also Read : Anaganaga Teaser : మళ్ళీ వస్తున్న సుమంత్.. ‘అనగనగా’ టీజర్.. తెలుగు భాష ప్రేమికులు చూడాల్సిందే..
ప్రస్తుతం రామ్ 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో జరుగుతుంది. తాజాగా షూటింగ్ సెట్ లో హీరో రామ్ ని, మూవీ యూనిట్ ని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారికంగా తెలిపారు.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హీరో రామ్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్ కి విచ్చేసిన స్టార్ హీరో శ్రీ రామ్ పోతినేని గారిని మరియు డైరెక్టర్ పి.మహేష్ బాబు గార్లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించాను. గోదావరి జిల్లాలలో తీసే సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయి. #RAPO22 కూడా శ్రీ రామ్ గారికి మంచి విజయాన్ని అందజేస్తుంది అని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు.
అయితే ఈ ఫొటోల్లో రామ్ లుక్ చాలా కొత్తగా ఉంది. గడ్డం లేకుండా క్లీన్ షేవ్ లుక్ లో హెయిర్ పెంచి కొత్తగా కనపడ్డారు రామ్. దీంతో ఫ్యాన్స్ రామ్ లుక్ ని వైరల్ చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామంలో @MythriOfficial ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్ కి విచ్చేసిన స్టార్ హీరో శ్రీ రామ్ పోతినేని గారిని మరియు డైరెక్టర్ పి.మహేష్ బాబు గార్లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర బృందంతో కాసేపు… pic.twitter.com/Ll6EEGpS3m
— Kandula Durgesh (@kanduladurgesh) February 22, 2025