Anaganaga Teaser : మళ్ళీ వస్తున్న సుమంత్.. ‘అనగనగా’ టీజర్.. తెలుగు భాష ప్రేమికులు చూడాల్సిందే..
తాజాగా సుమంత్ అనగనగా టీజర్ రిలీజ్ చేసారు.

Sumanth ETV Win Anaganaga Teaser Released
Anaganaga Teaser : ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాలు అందించిన సుమంత్ ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు త్వరలో ఓటీటీ సినిమాతో మళ్ళీ మెయిన్ లీడ్ గా రాబోతున్నాడు. ఈటీవీ విన్ ఓటీటీలో తెరకెక్కుతున్న అనగనగా సినిమాలో సుమంత్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు.
కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాకేష్ రెడ్డి, రుద్రా నిర్మాణంలో సన్నీ సంజయ్ దర్శకత్వంలో ఈ అనగనగా సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా అనగనగా టీజర్ రిలీజ్ చేసారు.
Get ready for the success story of a failure!
Anaganaga – A story of a storyteller.#Anaganaga – A Win Original Film, releasing this Ugadi only on ETV WIN app.
Directed by Sunny Sanjay📺 Teaser Out Now!@isumanth @rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd… pic.twitter.com/4FRIDGqQvj
— ETV Win (@etvwin) February 22, 2025
ఈ టీజర్ చూస్తుంటే.. సుమంత్ ఒక తెలుగు టీచర్ అని, తెలుగులోనే మాట్లాడటం, పిల్లలకు తెలుగులో అర్థమయ్యేలా అన్ని చెప్పడం చేసినా అందరూ అతన్ని ఫెయిల్యూర్ అని చిన్నచూపు చూస్తుంటారు. టీజర్ చూస్తుంటే తెలుగు భాష ప్రాముఖ్యతతో పాటు ఓ ఎమోషనల్ కంటెంట్ చెప్పబోతున్నారని తెలుస్తుంది. మార్చ్ 30 ఉగాది నాడు ఈటీవీ విన్ ఓటీటీలో అనగనగా సినిమా రిలీజ్ కానుంది.