Dhanraj Son : ధనరాజ్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అతని పేరుకు సుకుమార్ కి లింక్ ఏంటో తెలుసా? ధనరాజ్ ఫ్యామిలీ ఫొటో చూశారా?
ధనరాజ్ శిరీష అనే డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

Do You Know Jabardasth Dhanraj Son Name Back Story Dhanaraj Family Photo
Dhanraj Son : పలు సినిమాల్లో కమెడియన్ గా, జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు ధనరాజ్. ప్రస్తుతం టీవీ షోలకు దూరమైనా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే దర్శకుడిగా మారి రామం రాఘవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనరాజ్. తండ్రి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.
Also Read : Naga Chaitanya – Sobhita : చైతూ – శోభితల మంచి మనుసు.. క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలతో.. ఫోటోలు వైరల్..
ధనరాజ్ శిరీష అనే డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెద్దబ్బాయి పేరు సుక్కురామ్. చిన్న అబ్బాయి పేరు రాజ్ దీప్. అయితే పెద్దబ్బాయి సుక్కురామ్ పేరు వెనక పెద్ద కథే ఉంది.
ధనరాజ్ సినీ పరిశ్రమకు వచ్చాక చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జగడం సినిమాతోనే మొదట గుర్తింపు వచ్చి ఆ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చాయి. అలాగే ధనరాజ్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మొదటి సారి తన భార్య డెలివరీ సమయంలో డబ్బులు కూడా లేకపోవడంతో హీరో రామ్ ధనరాజ్ కు ఆర్ధిక సహాయం చేసి, ఇంకేం కావాలన్నా అడగమన్నాడు.
అందుకే ధనరాజ్ సుకుమార్ ని, రామ్ ని దేవుళ్లుగా చూస్తాడు. వీరిద్దరి పేర్లు వచ్చేలా ధనరాజ్ తన పెద్ద కొడుక్కి సుక్కురామ్ అని పేరు పెట్టాడు. సుక్కు రామ్ మొదటి 5 ఏళ్ళు ప్రతి పుట్టిన రోజుకు సుకుమార్, రామ్ వచ్చి మరీ ఆశీర్వదించారు. ఓ సారి సుకుమార్ ధనరాజ్ ని.. నా పేరు పెట్టావు, ఒకవేళ నేను సక్సెస్ అవ్వకపోతే నా పేరు ఎందుకు పెట్టావు అని వాడు ఫీల్ అవుతాడు అని అంటే.. వాడు ఫీల్ అవ్వకుండా మీరు సక్సెస్ అవుతారు అని అన్నాడట ధనరాజ్. సుకుమార్ ని ధనరాజ్ డాడీ అని పిలుస్తాడు.