Sankranthiki Vasthunnam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీవీలోకి వచ్చేస్తుంది.. డేట్, టైమ్, ఏ ఛానల్ తెలుసా?

తాజాగా నేడు సంక్రాంతికి వస్తున్నాం టీవీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ ప్రకటించారు.

Sankranthiki Vasthunnam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీవీలోకి వచ్చేస్తుంది.. డేట్, టైమ్, ఏ ఛానల్ తెలుసా?

Venkatesh Sankranthiki Vasthunnam Movie TV Telecast Date And Time Revealed

Updated On : February 22, 2025 / 5:32 PM IST

Sankranthiki Vasthunnam : వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా, vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండక్కి జనవరి 14న థియేటర్స్ లో రిలీజయి భారీ హిట్ అయింది. కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇటీవల ఓటీటీ అమ్మకం అయ్యాకే థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్న సమయంలో ఈ సినిమా మీద నమ్మకంతో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్మకుండానే థియేటర్స్ లోకి వచ్చింది.

Also Read : Indian Directors : ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్..

థియేటర్స్ లో రిలీజయి పెద్ద హిట్ అయ్యాక సంక్రాంతికి వస్తున్నాం సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడగా జీ సంస్థ రెండు హక్కులను కొనేసుకుంది. దీంతో ఈ సినిమా జీ5 ఓటీటీలోకి వచ్చే ముందే జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ విషయం కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. తాజాగా నేడు సంక్రాంతికి వస్తున్నాం టీవీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ ప్రకటించారు.

Also Read : Chiranjeevi : ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా.. ఫోటోలు చూశారా?

వెంకిమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు టీవీ ఛానల్ లో మార్చ్ 1 శనివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని టీవీలో చూడటానికి రెడీ అయిపోయారు. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ థియేటర్స్ లో మిస్ అయితే టీవీలో చూసేయండి. టీవీలో టెలికాస్ట్ అయిన కొన్ని రోజులకు ఓటీటీలోకి వస్తుందని సమాచారం. థియేటర్స్ లో కలెక్షన్స్ విషయంలో రికార్డులు బద్దలుకొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో ఏ రేంజ్ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి.