Chiranjeevi : ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా.. ఫోటోలు చూశారా?
'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' బుక్ సెకండ్ ఎడిషన్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

Master of Suspense Hitchcock Book Second Edition Launched By Megastar Chiranjeevi
Chiranjeevi : వరల్డ్ సినిమాలో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్స్ లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, ఆయన మొదటి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడితో కలిసి ఓ పుస్తకం రిలీజ్ చేసారు.
ఇటీవల డిసెంబర్ 18న మొదటి కాపీ విడుదలయి అన్ని పుస్తకాలు అమ్ముడుపోవడంతో తాజాగా సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు. ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. హిచ్ కాక్ సినిమాలు నేను కాలేజీ చదివే రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదవడం పూర్తిచేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం మంచి విషయం అని అన్నారు.
ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన పులగం చిన్నారాయణ, రవి పాడిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
ఈ పుస్తకానికి మల్లాది వెంకట కృష్ణమూర్తి, ఆర్జీవీ ముందుమాట రాశారు.
‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’లో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి.