Naga Chaitanya – Sobhita : చైతూ – శోభితల మంచి మనుసు.. క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలతో.. ఫోటోలు వైరల్..
హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను నాగచైతన్య - శోభిత సందర్శించారు.

Naga Chaitanya and Sobhita Dhulipala visited Saint Jude Child Care Center and Spent Time with Cancer Patients
Naga Chaitanya – Sobhita : నాగచైతన్య ఇటీవలే తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి చైతూ కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది.
ఇక గత డిసెంబర్ లో నాగచైతన్య – శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ప్రేమించుకొని వీరు పెళ్లి చేసుకున్నారు. తాజాగా చైతూ – శోభిత కలిసి బయటకు వెళ్లారు.
హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను నాగచైతన్య – శోభిత సందర్శించారు. అక్కడ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు ఉచిత ఆశ్రయం కల్పిస్తారు.
చైతూ, శోభిత అక్కడి పిల్లలతో, వారి పేరెంట్స్ తో ముచ్చటించారు. ఆ కేర్ సెంటర్ లో ఉన్న పిల్లలతో కలిసి నాగచైతన్య డ్యాన్స్ వేసాడు.
చైతూ, శోభిత వారితో ఆప్యాయంగా మాట్లాడి ఫోటోలు దిగారు. అక్కడ ఉన్న వారితో సరదాగా గడిపారు చైతూ శోభిత.
క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలకు ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో అభిమానులు, నెటిజన్లు చైతూ – శోభితల మంచి మనసుని అభినందిస్తున్నారు.