Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Ap Government Allows Ticket Price Hikes For Sarkaru Vaari Paata

Updated On : May 7, 2022 / 4:34 PM IST

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు తాజాగా ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది.

Sarkaru Vaari Paata: పెరిగిన ఎస్‌వీపీ ప్రమోషన్ స్పీడ్.. ఈరోజే ప్రీ రిలీజ్ పండగ!

సర్కారు వారి పాట చిత్రానికి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా రిలీజ్ రోజు నుండి 10 రోజుల పాటు ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక సాధారణ టికెట్ రేట్లపై రూ.40 మేర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే ప్రమోషన్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన సర్కారు వారి పాట చిత్ర యూనిట్, ప్రీరిలీజ్ వేడుకతో ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేయాలని చూస్తుంది.

Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

మహేష్ మాస్ స్వాగ్‌తో ఇటీవీల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమాలో నదియా, సముథ్రకని, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే.