Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 12న ఈ సినిమాను రిలీజ్ కానుండడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ నెలకొంది.

Sarkaru Vaari Paata : మ.. మ.. మహేశా.. మాస్ సాంగ్‌తో రాబోతున్న సూపర్‌స్టార్..

మొన్నటి వరకు జస్ట్ సినిమా వస్తుందని అనుకున్న ప్రేక్షకులు తాజాగా ట్రైలర్ రిలీజ్ తో మరోసారి మహేష్ బాబు పోకిరి రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడా అనే చర్చలు మొదలు పెట్టారు. ఎస్వీపీ ట్రైలర్ అంతగా ఆకట్టుకుంది. రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో దుమ్మురేపుతూ టాప్ ట్రెండ్ లో కొనసాగుతుంది. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలు పెట్టింది. అయితే.. ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata: మహేష్ దూకుడు.. యూట్యూబ్ లో ఎస్వీపీ ట్రైలర్ రికార్డులు!

కాగా.. మహేష్ సర్కారు వారి పాట సినిమా మాత్రం కేవలం తెలుగు సినిమాగా మాత్రమే రిలీజ్ అవుతుంది. దీనిపై స్పందించిన దర్శకుడు పరుశురాం పాన్ ఇండియా మూవీ ఎందుకు రిలీజ్ చేయడం లేదో కారణాలు చెప్పాడు. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సర్కారు వారి స్క్రిప్ట్ రాసుకున్నానని.. ఇందులో హీరో పాత్రలో ఎమోషనల్ థ్రెడ్ ఉంటుందని.. అది లోకల్ గా కనెక్ట్ అయి ఉంటుందని.. అలాంటిది పాన్ ఇండియా ఎలిమెంట్స్ జోడించి స్క్రిప్ట్ ని డైల్యూట్ చేయకూడదనే పాన్ ఇండియా జోలికి వెళ్లలేదని చెప్పాడు.