Balakrishna
Balakrishna : బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టు టాక్ ని సొంత చేసుకుంది. బాలకృష్ణ నుంచి చాలా కాలం తరువాత వస్తున్న ఫ్యాక్షన్ డ్రామా కథ కావడంతో భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజే దాదాపు రూ.54 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ఊచకోత అంటే ఏంటో చూపించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యిని.
దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చరిత్రని వక్రీకరించేలా మాట్లాడాడు అంటూ ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పేర్కొంది. అంతేకాకుండా దేవాంగ కులాన్ని హేళన చేసే విధంగా ‘లకలకలక’ అంటూ వికటాట్టహాసం చేశాడు అంటూ వెల్లడించారు. దేవాంగుల కుల గురువు దేవళ మహర్షి. కులదైవం చౌడేశ్వరి దేవి. దేవాంగుల చరిత్ర బ్రహ్మాండ పురాణంలో రాయబడింది. చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దేవాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి.
ఇతిహాసాలు, మనుచరిత్రతో ముడిపడిన దేవాంగుల జాతి ఖ్యాతిని అవహేళన చేస్తూ మాట్లాడడం తగదని పేర్కొన్నారు. తక్షణమే బాలకృష్ణ ఆ మాటలని వెనక్కి తీసుకోవాలి. అలాగే దేవాంగ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. మరి దీనిపై బాలకృష్ణ స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి. కాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకి వీరసింహారెడ్డి టీం వచ్చిన ఎపిసోడ్ ని పండుగ కానుకగా ఆహా టీం నేడు విడుదల చేసింది. ఈ షోలో దర్శకుడు గోపీచంద్, హీరోయిన్ హనీ రోజ్, మైత్రి నిర్మాతలు పాల్గొని సందడి చేశారు.