AR Rahman Concert : వివాదంగా మారిన రెహమాన్ కాన్సర్ట్.. ఆడియన్స్ ఫైర్.. స్పందించిన రెహమాన్, పోలీసులు..

ఈవెంట్ సక్సెస్ అయింది అని చెప్పుకుంటున్నా అభిమానులు, ప్రేక్షకులు మాత్రం ఈవెంట్ పై ఫైర్ అవుతున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా చెత్తగా కండక్ట్ చేసిందని రెహమాన్ అభిమానులు, ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.

AR Rahman Concert : వివాదంగా మారిన రెహమాన్ కాన్సర్ట్.. ఆడియన్స్ ఫైర్.. స్పందించిన రెహమాన్, పోలీసులు..

AR Rahman Concert Issues goes viral Rahman and Chennai Police Respond

AR Rahman Concert : ఆస్కార్ అవార్డు విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కి ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రెహమాన్ కి అభిమానులు ఉన్నారు. అలాంటి రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ పెడితే ఏ రేంజ్ లో ఫ్యాన్స్ వస్తారో తెలిసిందే. తాజాగా ఏర్పాటు చేసిన రెహమాన్ కాన్సర్ట్ సక్సెస్ అయినా వివాదంగా మారింది.

ఇటీవల BToS ప్రొడక్షన్స్, actc ఈవెంట్స్ సంస్థలు కలిసి రెహమాన్ తో మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్ ప్లాన్ చేశాయి. నెల రోజుల ముందు నుంచే టికెట్స్ అమ్మాయి. 5000, 10 వేలకు, 20 వేలకు కూడా టికెట్స్ అమ్మారు. అనుకున్న సమయానికి వర్షం పడి ఈవెంట్ వాయిదా పడింది. అప్పటికే వేరే రాష్టాల నుంచి వచ్చిన అభిమానులు నిరాశ చెందారు. వాయిదా పడిన ఈవెంట్ ఇటీవల సెప్టెంబర్ 10న చెన్నైలోని ఓ ఓపెన్ ప్లేస్ లో జరిగింది.

అయితే ఈ ఈవెంట్ సక్సెస్ అయింది అని చెప్పుకుంటున్నా అభిమానులు, ప్రేక్షకులు మాత్రం ఈవెంట్ పై ఫైర్ అవుతున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని, చాలా బాధలు పడ్డట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పార్కింగ్ 2 కిలోమీటర్ల దూరంలో ఇచ్చినట్టు, ఈవెంట్ లో తొక్కిసలాట జరిగినట్టు, కొంతమందికి గాయాలు అయ్యాయని, అలాగే టికెట్స్ కొనుక్కున్నా కూడా లోపలి పంపించలేదని, ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా చెత్తగా కండక్ట్ చేసిందని రెహమాన్ అభిమానులు, ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.

రెహమాన్ దగ్గరికి ఈ వివాదం చేరగా.. దీనిపై రెహమాన్ స్పందిస్తూ.. నా కాన్సర్ట్ కి టికెట్ కొనుక్కొని లోపలికి రాలేకపోయిన వాళ్లంతా మీ టికెట్ కాపీని arr4chennai@btos.in మెయిల్ కి మీరు ఎదుర్కున్న ఇబ్బందులు కూడా రాసి పంపించండి, మేము స్పందిస్తాము అని ట్వీట్ చేశారు. ఇక ఈ వివాదంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వగా చెన్నై పోలీసులు స్పందిస్తూ.. ఈవెంట్ కి 25000 మందికే పర్మిషన్ తీసుకున్నారు. ఆ ప్లేస్ కూడా అంతమందికి సరిపోతుంది. కానీ దాదాపు 50000 మంది వచ్చారు. చెప్పిన దానికంటే ఎక్కువగా 15000 పైగా టికెట్స్ అమ్మినట్టు తెలుస్తుంది. దీనిపై విచారణ జరిపిస్తాం అని అన్నారు. మొత్తానికి రెహమాన్ కాన్సర్ట్ సక్సెస్ అయిన వివాదాలమయంగా నిలిచింది.

Pushpa 2 : అల్లు అర్జున్‌కి పోటీగా కమల్ హాసన్, అజయ్ దేవగణ్.. పుష్ప 2 ఆ సినిమాలకు పోటీ ఇస్తుందా?

ఇక ఈ రెహమాన్ కాన్సెర్ట్ వివాదంపై కొంతమంది రెహమాన్ ని బ్లేమ్ చేస్తుంటే, మరికొంతమంది రెహమాన్ కి సపోర్ట్ చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ భాద్యత తీసుకోవాలి అని కోరుతున్నారు.