AR Rehaman : మేం విడిపోతున్నాం.. ఏఆర్ రెహమాన్‌తో భార్య సైరా బాను విడాకులు.. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు..!

AR Rehaman : ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ సైరా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

AR Rahman, Wife Saira Banu Are Separating After 29 Years

AR Rehaman : మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది మ్యూజిక్ మాస్ట్రో నుంచి విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి ఏఆర్ రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

గతకొద్దికాలంగా ఇరువురి మధ్య కలహాలు తారాస్థాయికి చేరినట్టుగా వార్తలు వచ్చాయి. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు.

అభిప్రాయభేదాల కారణంగా చివరికి విడిపోవడమే సరైన పరిష్కారంగా భావించినట్టుగా తెలిపారు. ఈ క్రమంలో ఏఆర్ రెహామాన్ ఫుల్ ఎమోషన్ అయినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో తమ ప్రైవసీని గౌరవించాలని, ప్రతిఒక్కరూ అండగా ఉండాలని రెహమాన్ కోరినట్టు తెలుస్తోంది. రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. సిమి గరేవాల్‌తో చాట్ షోలో రెహమాన్ మాట్లాడుతూ.. తన తల్లి తన పెళ్లిని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తనకు పెళ్లికూతురును వెతుక్కోవడానికి తనకు సమయం లేదని, తద్వారా కుదిర్చిన పెళ్లినే ఎంచుకున్నానని తెలిపాడు.

నిజం చెప్పాలంటే.. పెళ్లికూతురును వెతకడానికి నాకు సమయం లేదు. బాంబేలో సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని నాకు తెలుసు. నాకు 29ఏళ్లు. నేను మా అమ్మతో చెప్పాను. ‘నాకు పెళ్లికూతురును వెతుక్కో’ అని చెప్పానని రెహమాన్ అన్నాడు. రెహామాన్ తల్లి ఈ సంబధాన్ని చూసి ఓకే చెప్పారట.

రెహమాన్ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు. మూవీల విషయానికి వస్తే.. రెహమాన్ చివరిగా ధనుష్ రెండోసారి దర్శకత్వం వహించిన రాయన్ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఛావా, థగ్ లైఫ్, గాంధీ టాక్స్ సహా పలు భాషల మూవీలకు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also : Kriti Sanon : ప్రేమ‌లో కృతిస‌న‌న్‌..! ప్రియుడితో దిగిన ఫోటోని పోస్ట్ చేస్తూ..!