Karmasthalam : కర్మ స్థలం ఫస్ట్ లుక్ రిలీజ్.. మహిషాసుర మర్ధిని కాన్సెప్ట్ తో..
కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో అర్చన లుక్, గెటప్ ఆసక్తికరంగా ఉంది.

Archana Karmasthalam Movie First Look Released
Karmasthalam : రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కర్మ స్థలం. అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాలో. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : Parvati Nair Engagement : నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. పార్వతి నాయర్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..
కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో అర్చన లుక్, గెటప్ ఆసక్తికరంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో అమ్మవారి షాడో కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఇది మైథలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. కర్మ స్థలం సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి సబ్జెక్ట్‌ని, మంచి టైటిల్. కథ చెప్పడానికి వచ్చినప్పుడు డైరెక్టర్ రాకీ కొత్త వాడు అనుకున్నా కానీ కథను అద్భుతంగా నెరేట్ చేసి సినిమాని కూడా చాలా బాగా తీసాడు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి అని తెలిపింది.
Also Read : Brahmanandam : విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ..
డైరెక్టర్ రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. కర్మ స్థలం సినిమా వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నిర్మాత చాలా సపోర్ట్ చేశారు అని తెలిపాడు. నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. కర్మ స్థలం సినిమాను ఎంతో కష్టపడి చేశాం. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.