Ari Movie : హమ్మయ్య.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న అనసూయ సినిమా..

అరి సినిమా ఎప్పుడో రెడీ అయినా పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. (Ari Movie)

Ari Movie : హమ్మయ్య.. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న అనసూయ సినిమా..

Ari Movie

Updated On : October 3, 2025 / 3:52 PM IST

Ari Movie : ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ట్యాగ్ లైన్. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించగా పేపర్ బాయ్ సినిమా ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.(Ari Movie)

ఈ అరి సినిమా ఎప్పుడో రెడీ అయినా పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు అరి సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. దసరా సందర్భంగా అరి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అరి సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

Also See : Ram Charan : ఘనంగా ప్రారంభమైన ఆర్చరీ ప్రీమియర్ లీగ్.. గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఫొటోలు..

అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ తో అరిషడ్వార్గాలపై ఈ ‘అరి’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్ ని రిలీజ్ చేసారు.

Ari Movie Finally Anasuya Sai Kumar Movie Ready to Release

Also Read : Raviteja : ‘బాహుబలి’ టార్గెట్ 100 కోట్లు.. మరి రవితేజ టార్గెట్ ఎంత?