Raviteja : ‘బాహుబలి’ టార్గెట్ 100 కోట్లు.. మరి రవితేజ టార్గెట్ ఎంత?
ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి రవితేజ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. (Raviteja)

Raviteja
Raviteja : తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా రెండు పార్టులు పెద్ద విజయం సాధించి పాన్ ఇండియా మార్కెట్ తెచ్చిపెట్టాయి. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసాయి. బాహుబలి మొదటి సినిమా వచ్చి పదేళ్లు అవుతుండటంతో ఈ రెండు పార్ట్ లను కలిపి బాహుబలి ఎపిక్ అంటూ ఒకే సినిమా చేసి రీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.(Raviteja)
బాహుబలి ఎపిక్ అక్టోబర్ 31న రీ రిలీజ్ అవుతుంది. రెండు సినిమాలను కలిపి ఎడిటింగ్ లో కొన్ని సాంగ్స్, సీన్స్ తీసేసి ఒకే సినిమాగా చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్, ప్రేక్షకులు, టాలీవుడ్ జనాలు కూడా బాహుబలి ఎపిక్ ఎలా ఉంటుందో కొత్త ఎడిట్ అని ఎదురుచూస్తున్నారు.
Also Read : Allu Sirish : అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే నయనిక ఎవరు? సీక్రెట్ గా రెండేళ్ల ప్రేమ..
అయితే బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ సినిమాకు వంద కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఫ్యాన్స్, సినిమా లవర్స్ కచ్చితంగా ఈ సినిమాని చూస్తారు. అలాగే అన్ని సెంటర్స్ లో, ఓవర్సీస్ లో, పాన్ ఇండియా వైడ్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే 100 కోట్లు పక్కా అంటున్నారు. మూవీ టీమ్ కూడా కనీసం ఈజీగా 50 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారట.
రవితేజ
బాహుబలి ఎపిక్ మాట పక్కన పెడితే అదే డేట్ కి అక్టోబర్ 31 న రవితేజ మాస్ జాతర సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఎప్పట్నుంచో పలు మార్లు వాయిదా పడుతున్న ఈ సినిమా ఈ డేట్ కి వస్తుంది. ఆ డేట్ లో పెద్ద సినిమాలు, చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. కానీ బాహుబలి రీ రిలీజ్ ఉండటంతో రవితేజ కొత్త సినిమా పై ఎఫెక్ట్ ఎంతుంటుందో అని అంచనా వేస్తున్నారు. రవితేజ ఎప్పుడో ధమాకా సినిమాకు హిట్ కొట్టారు. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి రవితేజ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఆ తర్వాత రవితేజ అరడజను సినిమాలు చేసినా హిట్ పడలేదు.
Also See : Mrunal Thakur : బ్లాక్ డ్రెస్ లో..బోల్డ్ లుక్స్ తో మృణాల్ ఠాకూర్.. ఫొటోలు..
అయితే మాస్ జాతర సినిమాని స్టార్ యువ రైటర్ డైరెక్ట్ చేయడం, ఇందులో ఇడియట్ సినిమా రిఫరెన్స్ లు వాడటం, రవితేజ మళ్ళీ పోలీస్ పాత్ర చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం 50 కోట్ల వరకు ఈజీగానే వస్తాయి. వంద కోట్లు వస్తే పండగే. కానీ బాహుబలి రీ రిలీజ్ ఎఫెక్ట్ ఏమైనా పడినా, మాస్ జాతర టాక్ అటు ఇటు అయినా రవితేజకి మళ్ళీ కష్టమే. చూడాలి మరి రవితేజ మాస్ జాతర ప్రభాస్ బాహుబలి రీ రిలీజ్ ముందు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.