Allu Sirish : అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే నయనిక ఎవరు? సీక్రెట్ గా రెండేళ్ల ప్రేమ..

అల్లు ఫ్యామిలిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శిరీష్ పెళ్లి ప్రకటన చేయడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు శుభాకాంక్షలు తెలిపారు.(Allu Sirish)

Allu Sirish : అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే నయనిక ఎవరు? సీక్రెట్ గా రెండేళ్ల ప్రేమ..

Allu Sirish

Updated On : October 3, 2025 / 2:57 PM IST

Allu Sirish : ఇటీవల అల్లు శిరీష్ నయనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాను అని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతున్నట్టు, ఇరు కుటుంబాలలో ఒప్పుకున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అల్లు ఫ్యామిలిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శిరీష్ పెళ్లి ప్రకటన చేయడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు శుభాకాంక్షలు తెలిపారు.(Allu Sirish)

అయితే కేవలం అమ్మాయి పేరు మాత్రమే ప్రకటించాడు. అమ్మాయి చేయి పట్టుకొని కేవలం చేతులే కనపడేలా ఓ ఫోటో షేర్ చేసాడు. ఆ అమ్మాయి ఫేస్ చూపించలేదు, కనీసం ఆమె సోషల్ మీడియా అకౌంట్ కి ట్యాగ్ చేయలేదు. దీంతో అసలు అల్లు శిరీష్ చేసుకోబోయే నయనిక ఎవరు అని అంతా చర్చించుకుంటున్నారు.

Also Read : Sagar: తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం.. హీరోగా సాగర్.. పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా

టాలీవుడ్ లో అల్లు ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం ప్రకారం నయనిక తండ్రి రియల్ ఎస్టేట్, కనస్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారట. అల్లు శిరీష్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా నయనిక పరిచయం అయిందట. ఆల్మోస్ట్ గత రెండేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారట. బన్నీ భార్య స్నేహారెడ్డి లాగే నయనిక కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది.

రెండేళ్లు ప్రేమ, అసలు నయనిక ఎవరు అనే విషయాలు ఎక్కడా లీక్ అవ్వకుండా, ఎవరికీ తెలియకుండా బాగానే మెయింటైన్ చేసాడు శిరీష్. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు కొత్త జంటగా మారుతుందో చూడాలి. పెళ్లి సమయానికి అయినా ఆ అమ్మాయి ఎవరో చూపించి ఆమె సోషల్ మీడియా అకౌంట్ బహిర్గతం చేస్తాడేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Allu Sirish (@allusirish)

Also Read : Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? ‘చిరంజీవ’.. డైరెక్ట్ ఓటీటీలోకి..