Raj Tarun : రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ చూశారా? ‘చిరంజీవ’.. డైరెక్ట్ ఓటీటీలోకి..
నేడు దసరా సందర్భంగా రాజ్ తరుణ్ కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Raj Tarun)

Raj Tarun
Raj Tarun : రాజ్ తరుణ్, కుషిత కళ్లపు జంటగా తెరకెక్కుతున్న సినిమా చిరంజీవ. ఏ రాహుల్ యాదవ్, సుహాసిని యాదవ్ నిర్మాణంలో అభినయ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(Raj Tarun)
చిరంజీవ సినిమా డైరెక్ట్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. నవంబర్ 7 నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలోకి రానుంది. ఈ టీజర్ చూస్తుంటే.. అంబులెన్స్ డైరెక్టర్ గా పనిచేసే ఓ హీరోకి యముడికి సంబంధించిన ఏవో శక్తులతో మనిషి తలలపై వాళ్ళ జీవితకాలం కనిపిస్తుంది. మరి అది ఎటు దారి తీసిందో సినిమా చూడాల్సిందే. సినిమా కామెడీ డివోషినల్ టచ్ తో ఉండనుందని తెలుస్తుంది.
Also See : Nani Sujeeth : OG అయిపోయింది.. పండగ పూట నానితో మొదలుపెట్టిన సుజీత్..
మీరు కూడా చిరంజీవి టీజర్ చూసేయండి..