Arjit Singh : పాపం.. బాలీవుడ్ సింగర్ ని గాయపరిచిన మహిళా అభిమాని..

ఓ మహిళా అభిమాని అర్జిత్ సింగ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతని చెయ్యి పట్టుకొని గట్టిగా ఊపేసి, చెయ్యిని లాగేసింది. దీంతో అర్జిత్ అదుపు తప్పి పడబోయాడు. ఆ అభిమాని చెయ్యి గట్టిగా లాగడంతో చెయ్యి బెణికినట్టు సమాచారం.

Arjit Singh : పాపం.. బాలీవుడ్ సింగర్ ని గాయపరిచిన మహిళా అభిమాని..

Arijit Singh was pulled and injured by a female fan at an event

Updated On : May 9, 2023 / 9:03 AM IST

Arjit Singh :  బాలీవుడ్(Bollywood) టాప్ సింగర్స్ లో ఒకరు అర్జిత్ సింగ్. ఆషీకీ 2(Aashiqui 2) సినిమాతో బాలీవుడ్ లో పాపులర్ అయి అక్కడ్నుంచి వరుసగా హిందీతో(Hindi) పాటు అనేక భాషల్లో సాంగ్స్ పాడాడు అర్జిత్ సింగ్. స్వామి రారా, దోచేయ్, హుషారు, ఉయ్యాల జంపాల, భలే మంచి రోజు.. ఇలా పలు తెలుగు(Telugu) సినిమాల్లో కూడా అర్జిత్ తన పాటలతో మెప్పించాడు. సినిమా పాటలే కాక ప్రైవేట్ ఆల్బమ్స్(Privet Albums), ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు అర్జిత్ సింగ్.

తాజాగా అర్జిత్ సింగ్ మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఓ లైవ్ కాన్సర్ట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో పలు పాటలు పాడి ప్రేక్షకులని అలరించాడు. మధ్య మధ్యలో స్టేజికి దగ్గరగా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ, వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ వారిని మరింత సంతోషపరిచాడు. అయితే ఈ నేపథ్యంలో ఓ మహిళా అభిమాని అర్జిత్ సింగ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతని చెయ్యి పట్టుకొని గట్టిగా ఊపేసి, చెయ్యిని లాగేసింది. దీంతో అర్జిత్ అదుపు తప్పి పడబోయాడు. ఆ అభిమాని చెయ్యి గట్టిగా లాగడంతో చెయ్యి బెణికినట్టు సమాచారం.

సోషల్ మీడియాలో అర్జిత్ సింగ్ కు సంబంధించిన పలు వీడియో వైరల్ గా మారాయి. ఆ మహిళా అభిమాని అర్జిత్ చెయ్యి లాగిన తరువాత అర్జిత్ ఆమెతో కొంచెం సీరియస్ గానే మాట్లాడుతూ.. మీరు ఎందుకు ఇలా చేశారు, ఇప్పుడు నేను చెయ్యి కదల్పలేకపోతున్నాను, ఇది మీకు సరదా కావొచ్చు. కానీ నేను ఇప్పుడు ప్రోగ్రాం ఎలా చేస్తాను అని అన్నాడు. అయితే ఆ మహిళా అభిమాని సారీ కూడా చెప్పినటు సమాచారం. ప్రోగ్రాం లోనే చెయ్యి నొప్పితో బాధపడినట్టు తెలుస్తుంది. మరుసటి రోజు ఉదయం అర్జిత్ సింగ్ చెయ్యికి కట్టుతో కనిపించడంతో అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు.

Ravikrishna : నవ్యస్వామితో రిలేషన్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ.. తనొచ్చి ప్రపోజ్ చేస్తే?

చెయ్యి బెణికినందుకే కట్టు కట్టినట్టు, అర్జిత్ చేయికి కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలని, కొన్ని రోజులు కోలుకునే దాకా గిటార్ వాయించలేడని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. దీంతో అర్జిత్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఇలా చేసిన ఆ అభిమానిపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.