Jacky Bhagnani : సినిమా షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ భర్తకు గాయాలు.. ఆ హీరోకు కూడా గాయాలు..

జాన్వీ కపూర్ అన్నయ్య అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'మేరే హస్బెండ్‌ కి బీవీ'. ఈ సినిమాని రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు.

Jacky Bhagnani : సినిమా షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ భర్తకు గాయాలు.. ఆ హీరోకు కూడా గాయాలు..

Arjun Kapoor and Rakul Preet Husband Jacky Bhagnani Injured in Movie Shooting After Ceiling Collapses

Updated On : January 20, 2025 / 3:11 PM IST

Jacky Bhagnani : సినిమా షూటింగ్స్ లో అప్పుడప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయని తెలిసిందే. గతంలో అలాంటి ప్రమాదాల వల్ల పలువురికి గాయాలు అయితే కొంతమంది చనిపోయారు కూడా. తాజాగా బాలీవుడ్ లోని ఓ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. జాన్వీ కపూర్ అన్నయ్య అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘మేరే హస్బెండ్‌ కి బీవీ’. ఈ సినిమాని రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్, భూమి పెడ్నేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇటీవల ముంబైలోని ఓ పాత బిల్డింగ్ లో ఈ సినిమా షూట్ జరుగుతుండగా సీలింగ్ కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా కొంత ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అప్పుడు సెట్ లో ఉన్న హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీకి కూడా గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జనవరి 18న జరిగినట్టు తెలిపారు మూవీ యూనిట్.

Also Read : RGV : 27 ఏళ్ళ తర్వాత ఆ సినిమా చూసి ఏడ్చిన ఆర్జీవీ.. నేను తప్పు చేశాను అంటూ ఎమోషనల్ ట్వీట్..

నిర్వహణ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ భద్రత విషయంలో ఈ స్థలాన్ని సరిగ్గా పరిశిలించలేదని, ఈ ప్రమాదం వల్ల ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ షూటింగ్ ఆపేశారని ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ అధ్యక్షుడు తివారీ తెలిపారు. దీంతో అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ త్వరగా కోరుకోవాలని పలువురు ఫ్యాన్స్, బాలీవుడ్ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ షూటింగ్ దశలో ఉంది. ఫిబ్రవరి 21న ఈ సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Pooja Entertainment (@pooja_ent)

Also See : సైఫ్ పై దాడి చేసిన నిందితుడు ఎలా దొరికాడంటే..? కీలకంగా మారిన గూగుల్ పే..