RGV : 27 ఏళ్ళ తర్వాత ఆ సినిమా చూసి ఏడ్చిన ఆర్జీవీ.. నేను తప్పు చేశాను అంటూ ఎమోషనల్ ట్వీట్..

తాజాగా ఆ సినిమా చూసిన తర్వాత తాను ఏడ్చానని, అప్పటికి ఇప్పటికి నేను చాలా మారిపోయానని ఎమోషనల్ అవుతూ ఓ పెద్ద ట్వీట్ చేసారు ఆర్జీవీ.

RGV : 27 ఏళ్ళ తర్వాత ఆ సినిమా చూసి ఏడ్చిన ఆర్జీవీ.. నేను తప్పు చేశాను అంటూ ఎమోషనల్ ట్వీట్..

RGV Cried after Watching Satya Film after 27 Years and Shares a Emotional Note in Twitter

Updated On : January 20, 2025 / 1:35 PM IST

RGV : ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ గతంలో తన సినిమాలతో ఇండియన్ సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కానీ కాలక్రమేణా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి నా ఇష్టం అంటూ తనకు నచ్చిన సినిమాలు చేస్తున్నాడు. ఏదో టైం పాస్ సినిమాలు చేస్తున్నాడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఒకప్పుడు బాలీవుడ్ సైతం పొగిడిన దర్శకుడిని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవట్లేదు.

రెగ్యులర్ గా తన ట్విట్టర్లో ఏవేవో ట్వీట్స్ వేసే ఆర్జీవీ తాజాగా వేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇటీవల ఆర్జీవీ తీసిన సత్య సినిమా రీ రిలీజ్ అయింది. జెడి చక్రవర్తి, మనోజ్ బాజపేయ్, ఊర్మిళ మండోద్కర్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో 1998 లో వచ్చిన సత్య సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది. బాలీవుడ్ లో అప్పటి వరకు తీస్తున్న సినిమా స్టైల్ ని మార్చింది. మాఫియా, అండర్ వరల్డ్ అనే సినిమాలకు సత్య సినిమా ఒక టెక్స్ట్ బుక్ అయింది.

Also Read : Vijaya Rangaraju : సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత.. ఒకప్పుడు స్టార్ విలన్..

తాజాగా 27 ఏళ్ళ తర్వాత సత్య సినిమాని ఇటీవల జనవరి 17న రీ రిలీజ్ చేసారు. ముంబైలో జరిగిన స్పెషల్ షోకి అప్పుడు మూవీలో నటించిన వాళ్ళు, ఆ సినిమాకు పనిచేసిన వాళ్లంతా వచ్చారు. ఆర్జీవీ కూడా ఇందులో భాగమయ్యారు. తాజాగా ఆ సినిమా చూసిన తర్వాత తాను ఏడ్చానని, అప్పటికి ఇప్పటికి నేను చాలా మారిపోయానని ఎమోషనల్ అవుతూ ఓ పెద్ద ట్వీట్ చేసారు ఆర్జీవీ.

ఆర్జీవీ తన ట్విట్టర్లో లో.. 27 ఏళ్ళ తర్వాత రెండు రోజుల క్రితం సత్య సినిమా మళ్ళీ చూసాను.ఆ సినిమా అయిపోయే సమయానికి నేను ఏడవడం మొదలుపెట్టాను. నా కన్నీళ్లు కంట్లో నుంచి బుగ్గలపైకి జారాయి. చుట్టూ ఎవరైనా చూస్తున్నారా అని నేను పట్టించుకోలేదు. ఈ కన్నీళ్లు కేవలం సినిమా కోసమే కాదు. ఒక సినిమాని తయారుచేయడం అంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం లాంటిది. ఒక సినిమా ముక్కలు ముక్కలుగా నిర్మిస్తాం. అది మొత్తం పూర్తయిన తర్వాత దాని గురించి ఎవరు ఏం చెప్తారో అని చూస్తాము. అది హిట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అని వెళ్ళిపోతాను. నన్ను నేను అలా తయారుచేసుకున్నాను. రెండు రోజుల క్రితం వరకు కూడా ఈ సినిమా నా గమ్యంలో మరో అడుగు అని నేను మర్చిపోయాను.

సత్య సినిమా చూసి హోటల్ కి వచ్చాక చీకట్లో కూర్చొని నా తెలివితో నేను ఎందుకు ఈ సినిమాను భవిష్యత్తులో తీసే సినిమాలకు బెంచ్ మార్క్ గా పెట్టుకోలేకపోయాను అని ఆలోచించాను. నేను కేవలం ఆ సినిమాలోని ఎమోషన్ కి మాత్రమే ఏడవలేదు. అప్పుడు ఉన్న నా వర్షన్ కి కూడా ఆనందించి ఏడ్చాను. అలాగే సత్య సినిమాతో నన్ను నమ్మినవాళ్లందరికి నేను చేసిన ద్రోహానికి కూడా ఏడ్చాను. నేను మద్యం మత్తులో ఉన్నాను కానీ నా విజయం, నా అహంకారంతో ఈ విషయం నాకు రెండు రోజుల క్రితం వరకు అర్ధం కాలేదు.

రంగీలా, సత్య సినిమా విజయాలు నన్ను అంధుడిని చేయడంతో నేను నా విజన్ కోల్పోయి షాక్ వ్యాల్యూ, జిమ్మిక్స్, అసభ్యకరంతో, నా సాంకేతికతతో అర్ధం లేని సినిమాలు చేశాను. అది నేను అర్ధం చేసుకోలేకపోయాను. సత్య తర్వాత కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కానీ వాటిని నేను సత్య సినిమాని తీసినంత నిజాయితితో, నిబద్దతతో తీయలేదు. నా కొత్త రకమైన ఆలోచనలు అంధుడిని చేయడంతో నేను వేగంగా పరిగెత్తాను నేను ఎక్కడి నుంచి వచ్చింది మర్చిపోయాను. అది నా పతనాన్ని సూచించింది. నేను చేసిన తప్పులను సరిద్దిద్దుకోలేను కానీ నా కళ్ళు తుడుచుకుంటూ నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను ఇక నుంచి తీసే సినిమాలు నేను డైరెక్టర్ ఎందుకు కావాలనుకున్నాను అనే గౌరవంతో చేస్తాను. సత్య లాంటి సినిమా మళ్ళీ చేయలేకపోవచ్చు కానీ అలా చేయాలని ఆలోచన లేకపోవడం కూడా నేరమే. నేను సత్య లాంటి సినిమాలు తీయకపోవచ్చు కానీ జానర్ ఏదైనా ఆ సినిమా తీసినంత నిజాయితీగా మళ్ళీ సినిమాలు తీస్తాను. నేను గతంలో ఏ సినిమా చేసే ముందు అయినా సత్య సినిమా చూసి చూసి ఉంటే బాగుండేది. ఇది ప్రతి దర్శకుడికి ఒక మేలుకొలుపు లాంటిది. చివరగా నేను నాకు ప్రమాణం చేసుకుంటున్నాను. మిగిలిన నా ఈ జీవితంలో నా సమయం మొత్తం నిజాయితీగా సత్య లాంటి ఒక మంచి సినిమా తీయడానికి కేటాయిస్తాను అని సత్య పై ప్రమాణం చేస్తున్నాను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసారు.

 

దీంతో ఆర్జీవీ ట్వీట్ వైరల్ గా మారింది. ఎప్పుడూ పిచ్చి పిచ్చి ట్వీట్స్ వేసే ఆర్జీవీ ఇలాంటి ఎమోషనల్ ట్వీట్ పెట్టడం అందర్నీ ఆలోచింపచేస్తుంది. మరి ఆర్జీవీ ట్వీట్ లో చెప్పినట్టు ఇప్పుడైనా మారి ఒక మంచి సినిమా మళ్ళీ తీస్తాడా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ఎప్పటిలాగే తాగి పెట్టి ఉంటాడు ఈ ట్వీట్, రేపట్నుంచి మళ్ళీ మామూలే అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో నిందితుడ్ని పట్టించిన ‘షూ కలర్’.. ఎలా అంటే..?