Arjun Rampal : కూతురి విజయాన్ని చూసి పొంగిపోతున్న బాలీవుడ్ హీరో..
బాలీవుడ్ హీరో 'అర్జున్ రాంపాల్' (Arjun Rampal) తన కూతురు సాధించిన విజయం గురించి చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

Arjun Rampal emotional post on his daughter Myra success
Arjun Rampal : స్టార్ కుటుంబం నుంచి వారసులు వస్తున్నారు అంటే చాలా విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది. వారిలో టాలెంట్ ఉన్నా, నెపోటిజం అంటూ వారిని నిందించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చాలామంది స్టార్స్ ఈ నెపోటిజం సమస్యను ఎదురుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది. కొంతమంది చేసిన పనికి బాలీవుడ్ లోని ఇతర స్టార్ కిడ్స్ ఈ మాటలు ఎదురుకుంటున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో.. తన కుమార్తె సాధించిన విజయాన్ని చెప్పుకొస్తూ, ఆ విజయం తన మెరిట్ వల్ల వచ్చింది అంటూ పోస్ట్ వేశాడు.
Manoj Vs Vishnu : మనోజ్ తనకి ఆ అధికారం వద్దని విష్ణుకే ఇచ్చేయమన్నాడు.. మోహన్ బాబు!
బాలీవుడ్ లో పలు రొమాంటిక్ సినిమాల్లో హీరోగా నటించి, ఆ తరువాత షారుఖ్ ఖాన్ డాన్, రా వన్ వంటి సినిమాల్లో విలన్ గా మెప్పించిన నటుడు ‘అర్జున్ రాంపాల్’ (Arjun Rampal). ఈ హీరో మోడల్ అయిన మెహర్ జెసియాని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు. అయితే వీరిద్దరూ 2019 లో విడాకులు తీసుకోని విడిపోయారు. కాగా వీరిద్దరి రెండో కుమార్తె ‘మైరా’ (Myra).. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ షో క్రిస్టియన్ డియోర్ లో (Christian Dior) స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అర్జున్ రాంపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
“ఈ రోజు నా అందమైన లిటిల్ ప్రిన్సెస్ మైరా రాంపాల్.. తన మొదటి రన్‌వేలో నడిచింది. అది కూడా క్రిస్టియన్ డియోర్ కోసం. దానిలోని గొప్పదనం ఏముంది అనుకుంటున్నారా? ఆమె తన స్వంత మెరిట్‌తో అన్నింటినీ సాధించుకుంది. ఆడిషన్‌ల నుండి ఫిట్టింగ్‌ల వరకు అన్ని టఫ్ పోటీల నుండి ఎంపికైంది. ఆమె నన్ను ఎంతో గర్వించేలా చేసింది. ఆమెకు మరిన్ని విజయాలు, ప్రేమ కలగాలని కోరుకుంటున్నాను. మైరా ఈరోజు నువ్వు ఒక స్టార్” అంటూ తండ్రిగా తన ఆనందాన్ని తెలియజేశాడు.
View this post on Instagram