స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన హైకోర్టు!

స్టార్ హీరో సుదీప్‌కు కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈగ, బాహుబలి వంటి చిత్రాలలో నటించిన సుదీప్ సైరాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చాలా ఇబ్బందులలో ఉన్నారు. గత కొంత కాలంగా హైకోర్టులో విచారణ సాగుతున్న కాఫీ ఎస్టేట్ వివాదంలో కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడనే ఆరోపణ రావడంతో.. అక్కడి హైకోర్టు సుదీప్‌ను అరెస్ట్ చేయలని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల మే 22 లోగా సుదీప్ ఎక్కడ ఉన్నాడో అచూకి తెలుసుకుని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించింది JMFC కోర్టు.
అసలు ఏం జరిగిందంటే..? సుదీప్ 2016లో వారసదార అనే టీవీ షో నిర్వహించాడు. దాని షూటింగ్ కోసం దీపక్ పటేల్ అనే వ్యక్తికి చెందిన కాఫీ ఎస్టేట్‌ను అద్దెకు తీసుకున్నారు. దీని కోసం రూ.80 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్న సుదీప్ ముందుగా 50 వేలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా అమౌంట్‌ను ఎగ్గొట్టారని కర్ణాటక చిక్ మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు చేశారు.
ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా తనని మోసం చేశారని జిల్లా SP సలహా మేరకు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్. సుదీప్, ఆయనకు చెందిన ప్రొడక్షన్ హౌస్ కిచ్చా క్రియేషన్స్ పైనా, డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. ప్రస్తుతం సుదీప్‌కి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.