Vintara Saradaga : మహేష్ మేనల్లుడి కొత్త సినిమా.. వింటారా సరదాగా..

హీరో మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు మ‌హేశ్‌బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్‌.

Vintara Saradaga : మహేష్ మేనల్లుడి కొత్త సినిమా.. వింటారా సరదాగా..

Ashok Galla VISA VintaraSaradaga First look

Updated On : July 11, 2025 / 1:53 PM IST

హీరో మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు మ‌హేశ్‌బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్‌. నూతన దర్శకుడు ఉద్భవ్ డైరెక్ష‌న్‌లో ఆయ‌న ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వీసా- వింటారా సరదాగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా టైటిల్ తో పాటు ఫ‌స్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అశోక్ గల్లా కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను శ‌నివారం ఉద‌యం 10.53 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

Prabhas : విలన్‌ రోల్‌లో డార్లింగ్‌ ప్రభాస్‌..?

అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను, మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని.. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.