Ramnagar Bunny : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ‘రామ్ నగర్ బన్నీ’ టీజర్ వచ్చేసింది..

తాజాగా రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు.

Attitude Star Chandrahas Ramnagar Bunny Movie Teaser Released

Ramnagar Bunny Teaser : సీరియల్ స్టార్ ప్రభాకర్ తనయుడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా ఇటీవల రామ్ నగర్ బన్నీ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్రలు హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మాణంలో శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో రాబోతుంది.

ఇటీవల రామ్ నగర్ బన్నీ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూస్తుంటే ఓ కాలేజీ కుర్రాడి లైఫ్ ని ఎంటర్టైన్మెంట్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ యూనిట్. మీరు కూడా రామ్ నగర్ బన్నీ టీజర్ చూసేయండి..

 

ఇక టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ.. ప్రభాకర్ నాకు మంచి ఫ్రెండ్. నా దగ్గర ఉన్న ఒక కథని విని నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్ ని హీరోగా పరిచయం చేస్తూ తనే ప్రొడ్యూసర్ గా కూడా చేసాడు. చంద్రహాస్ సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. చాలా ఎనర్జీ ఉన్న హీరో. నేను అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ తో ప్రభాకర్ సినిమాని నిర్మించారు. అక్టోబర్ 4న థియేటర్స్ లోకి ఈ సినిమా రానుంది అని తెలిపారు.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి..

ప్రభాకర్ మాట్లాడుతూ.. బుల్లితెర మీద నన్ను ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. అందుకే మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేసేటప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమానే చేయాలి అనుకున్నాం. అందుకే చంద్రహాస్ వి ఇంకో రెండు సినిమాలు ఉన్నా ఇదే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడ్డాం. కానీ చంద్రహాస్ వాటిని పాజిటివ్ గా తీసుకున్నాడు. రామ్ నగర్ బన్నీ లాంటి సినిమాను ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ కు థ్యాంక్స్. అతను మా అబ్బాయితో ఇంకో సినిమా కూడా చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతోనే రామ్ నగర్ బన్నీ చేశాను. నన్ను ఆదరించినట్టే చంద్రహాస్ ని ఆదరించండి. సినిమాలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. కుటుంబ ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని చూడొచ్చు అన్నారు.

హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. నాకు మొదటి సినిమాగా ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. నన్ను స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేసారు. నేను డ్యాన్స్ లు బాగా చేశానని అంటున్నారు. అందుకోసం చాలా ప్రాక్టీస్ చేశాను. నాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లు ఇష్టం. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని నటిస్తాను. ఈ సినిమాను ఏ భాషలో చూసినా సబ్ టైటిల్స్ వేస్తే చాలు ఎంజాయ్ చేసేస్తారు ప్రేక్షకులు అని తెలిపారు.