Multiplex Theaters : జీఎస్టీ తగ్గినా రేట్లు తగ్గలే.. ఒక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కి 820 రూపాయలా? PVRని ప్రశ్నించిన నెటిజన్.. PVR ఏం చేసిందో తెలుసా?

తాజాగా ముంబైకి చెందిన ఓ ప్రేక్షకుడు ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే దానికి 820 రూపాయలు అయ్యాయి. దీంతో ఆ బిల్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ డబ్బులతో ఒక సంవత్సరం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని PVR ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Multiplex Theaters : జీఎస్టీ తగ్గినా రేట్లు తగ్గలే.. ఒక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కి 820 రూపాయలా? PVRని ప్రశ్నించిన నెటిజన్.. PVR ఏం చేసిందో తెలుసా?

Audion Questioned PVR for very high rates of Popcorn and Cool Drinks and PVR Replied

Updated On : July 13, 2023 / 11:51 AM IST

PVR Popcorn Rate :  గత కొంత కాలంగా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్ రేట్లు తగ్గించాలని ప్రేక్షకులు, సినిమా పరిశ్రమ వ్యక్తులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, ఫుడ్, కూల్ డ్రింక్స్ రేట్ల వల్ల కూడా ప్రేక్షకులు థియేటర్స్ కి రావట్లేదని అంతా అంటున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మల్టీప్లెక్స్ లలోని ఫుడ్ మీద 18 శాతం ఉన్న GSTని 5 శాతానికి తగ్గించారు. దీంతో చాలామంది మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్ర్న్ డ్రింక్స్ రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ అవి తగ్గలేదు. అసలు రేట్లు పెంచి, బిల్ లో మాత్రం 5 శాతమే GST చూపిస్తున్నారు.

తాజాగా ముంబైకి చెందిన ఓ ప్రేక్షకుడు ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే దానికి 820 రూపాయలు అయ్యాయి. దీంతో ఆ బిల్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఈ డబ్బులతో ఒక సంవత్సరం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని PVR ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ బిల్ లో GST రేటు 5 శాతమే ఉన్నా రేట్లు మాత్రం అంతే ఎక్కువగా ఉన్నాయి. పాప్ కార్న్ కేవలం 55 గ్రాములు 460 రూపాయలు(జీఎస్టీ లేకుండా 440 రూపాయలు), పెప్సీ 600ml 360 రూపాయలు(జీఎస్టీ లేకుండా 343 రూపాయలు) ఉంది. దీంతో GST తగ్గినా రేట్లు తగ్గలేదని అర్థమైపోయింది.

Nani 30 : నాని 30 అప్డేట్ వచ్చేసింది.. ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చేస్తున్న నాని..

అయితే ఈ బిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో PVR దీనిపై స్పందించింది. #PVRHeardYou అనే ట్యాగ్ తో మేము విన్నాం అంటూ సరికొత్త క్యాంపైన్ స్టార్ట్ చేసింది. ఈ క్యాంపైన్ తో రేట్లు తగ్గిస్తాం అని చెప్తుంది. తాజాగా వీక్ డేస్ లో 99 రూపాయలకే బర్గర్, సమోసా, కూల్ డ్రింక్, శాండ్ విచ్ అందచేస్తామని ప్రకటించింది. ఇక వీకెండ్ డేస్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ పై అన్ లిమిటెడ్ ఆఫర్స్ ప్రకటించింది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఆఫర్ పెట్టినా కండిషన్స్ కూడా చాలానే పెట్టింది. కండిషన్స్ అప్లై అని చెప్తుంది PVR. PVR కి దేశవ్యాప్తంగా దాదాపు 9000 స్క్రీన్స్ ఉన్నాయి. PVR ఆదాయంలో ఆల్మోస్ట్ 35 శాతం ఫుడ్ మీద నుంచే వస్తుంది. మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, ఫుడ్, కూల్ డ్రింక్స్ రేట్లు ఎప్పటికి తగ్గుతాయో చూడాలి మరి.

.