Devara : చడీచప్పుడు కాకుండా ‘ఆయుధ పూజ’ సాంగ్ వచ్చేసింది.. గూస్‌బంప్స్ అంతే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర.

Ayudha Pooja Song from Devara movie out now
Ayudha Pooja Song : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. రెండు భాగాలుగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. కాగా.. తొలి భాగం శుక్రవారం (సెప్టెంబర్ 27)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ మూవీలోని ఆయుధ పూజ సాంగ్ తప్ప అన్ని పాటలను విడుదల చేశారు. మొన్ననే రిలీజ్ చేస్తామని చెప్పినా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. రేపే సినిమా రిలీజ్ ఉండడంతో ఇక పాటను డైరెక్ట్‌గా సినిమాలో చూడాలేమో అని అనుకుంటుండగా.. అకస్మాత్తుగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే’ అంటూ ఈ పాట సాగుతోంది.
Devara : తెల్లారితే దేవర రిలీజ్.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు.. థియేటర్లలో తనిఖీలు
రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా అనిరుద్ అందించిన సంగీతం ఓ రేంజ్‌లో ఉంది. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ పాట దూసుకుపోతుంది. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.