Rashmika Mandanna : హారర్ కామెడీతో భ‌య‌పెట్టేందుకు వ‌స్తున్న రష్మిక మంద‌న్న.. సినిమా పేరు ఏంటో తెలుసా?

పుష్ప మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకుంది ర‌ష్మిక మంధాన.

Ayushmann Khurrana Rashmika Mandanna Starrer name is Thama

పుష్ప మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకుంది ర‌ష్మిక మంధాన. సౌత్‌లోనే కాకుండానే బాలీవుడ్‌లోనూ వ‌రుస చిత్రాల‌ను చేస్తూ య‌మా బిజీగా ఉంది. గ‌తేడాది యానిమ‌ల్ మూవీతో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఆమె మ‌రో మూవీలో న‌టిస్తోంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నారు.

స్త్రీ, బేడియా, ముంజ్యు క్రియేట‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ‘థ‌మా’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది.

Janaka Aithe Ganaka : ఆ రోజు నుండి ఆహా ఓటీటీలోకి వచ్చేస్తున్న సుహాస్ ‘జనక అయితే గనక’..

ఈ యూనివ‌ర్స్ ఓ ప్రేమ క‌థ‌ను కోరుకుంటోంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ అది చాలా ఉద్వేగంతో కూడుకున్న‌దని టీమ్ తెలిపింది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది (2025) దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హార‌ర్‌, కామెడీ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

Nishad Yusuf : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ‘కంగువా’ ఎడిట‌ర్ క‌న్నుమూత‌.. త‌న సొంత ఇంట్లో శ‌వ‌మై క‌నిపించిన యూస‌ఫ్‌