బిగ్ బాస్ ఎలిమినేషన్: బాబా సేఫ్.. రవి కృష్ణ అవుట్!

సంచలనాలకు కేరాఫ్ బిగ్ బాస్. మూడవ సీజన్ లో అసలైన పోరు గట్టం మొదలైంది. ఇప్పటివరకు సరదాగా సాగిపోయిన బిగ్ బాస్ ఈ వారం మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ గా మారిపోయింది. పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్ మధ్య గొడవలుతో వాళ్లు విడిపోగా ఆసక్తికరంగా మారిపోయింది బిగ్ బాస్. వాళ్లు విడిపోవడంతో ఆ బ్యాచ్ డామినేషన్ తగ్గిపోయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీక్షకులు. ఇదిలా ఉంటే అనూహ్యంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అలీరెజా.. మళ్లీ అంతే సర్‌ప్రైజ్ ఇస్తూ రీఎంట్రీ ఇచ్చేశాడు. హౌస్ లో అలీ ఎంట్రీతో హౌస్ లో మళ్లీ అనేక విషయాలు మారిపోయాయి.
కొన్నాళ్ల పాటు బయట ఉండి వచ్చిన అలీ.. ఎవరికెంత క్రేజ్ ఉంది.. సోషల్ మీడియాలో ట్రెండ్ ఎలా మారిందనే తెలిసే ఉంది. అందులో భాగంగా పీవీవీఆర్(పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్) బ్యాచ్ గురించి బాబా, శివజ్యోతి, రవిలతో అలీ చెబుతున్నాడు కూడా. ఆ నలుగురు కలిసి ఉన్నంతవరకు వాళ్లు ఎలిమినేట్ కారు.. బయట బాగా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్లు అని చెప్పాడు. బయట ఎలా జరగుతుందో అలీకి తెలుసు కాబట్టి.. ఇకపై ఇంకా మంచిగా గేమ్ ఆడతాడంటూ శివజ్యోతి, రవిలు మాట్లాడుకున్నారు. అలీ మాటను బట్టి ఆడొద్దు అని మరోవైపు శ్రీముఖి చెబుతుంది.
ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయంపై కూడా భారీగానే చర్చలు జరుగుతున్నాయి. శ్రీముఖి, రవి కృష్ణ, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ లో ఉండగా.. వరుణ్ సందేశ్ మరియు శ్రీముఖి ఎక్కువ ఓట్లను పొంది సేఫ్ అయ్యినట్లుగా చెబుతున్నారు. ఎలిమినేషన్ విషయంలో బాబా భాస్కర్, రవి కృష్ణ మధ్య టఫ్ ఫైట్ నడవగా.. చివరకు రవి కృష్ణ ఎలిమినేట్ అయినట్లుగా చెబుతున్నారు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఆదివారం(28 సెప్టెంబర్ 2019) సాయంత్రం వరకు ఆగాల్సిందే.