Baby director Sai Rajesh viral comments on Chiranjeevi
Sai Rajesh : సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ బేబీ (Baby). జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అని అందుకొని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరి అభినందిస్తున్నారు.
ఈ క్రమంలోనే మొన్న అల్లు అర్జున్, తాజాగా చిరంజీవి.. బేబీ మెగా ఈవెంట్ నిర్వహించి చిత్ర యూనిట్ అభినందించారు. ఇక ఈ ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. “మా జీవితాలు గురించి మీకు తెలియదు అన్నయ్య. ఒక్కసారి మాలా బ్రతికి చూడండి” అంటూ చిరంజీవి (Chiranjeevi) పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Extra Ordinary Man : నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ నుంచి క్రేజీ అప్డేట్.. హార్ట్ టచింగ్ మెలోడి..
సాయి రాజేష్ మాటలు..
మెగాస్టార్ అభిమానిగా ఎప్పుడూ గర్వపడుతుంటా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారిని కలిస్తే చాలనుకున్నా. బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి బ్లడ్ ఇచ్చి వస్తుంటే చిరంజీవిగారు వస్తున్నారు అని చెప్పారు. మేము బలంగా అనుకుంటే మీరు (చిరంజీవి) తప్పకుండా కలుస్తారు. బేబీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మీరు రావాలని, వస్తారని అనుకున్నాం. అప్పుడు యూఎస్ లో ఉన్నారు. కానీ మేము గట్టిగా నమ్మాం మమ్మల్ని బ్లెస్ చేసేందుకు మీరు వస్తారని. ఇవాళ సక్సెస్ మీట్ కు వచ్చారు.
Samajavaragamana : థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ సరికొత్త రికార్డును సృష్టించిన సామజవరగమన
అయితే మీకు ఇవాళ ఒక విషయం చెప్పాలి అన్నయ్య. ఒక విషయంలో మాత్రం మీరు దురదృష్టవంతులు. చిరంజీవి అభిమానులుగా మా జీవితాలు మీకు తెలియదు అన్నయ్య. జీవితంలో ఒక్కసారి అయినా మాలా బ్రతికి చూడండి. అభిమానులుగా మేము బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా గుర్తొచ్చేది మీరే, వినేది మీ పాటే. అది అమెరికా అయినా, చిన్న ఊరిలో ఆటోవాలా అయినా మీ సినిమాలు, మీ పాటలే మా అందరికి అసలైన కిక్కు. ఇవాళ మిమ్మల్ని ఈ ఫంక్షన్ లో చూస్తుంటే ఎన్నో మెమొరీస్ గుర్తొస్తున్నాయి. మనస్ఫూర్తిగా మీకు థాంక్స్ చెబుతున్నాం.