Urvasivo Rakshasivo: అల్లు వారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి నరసింహ.. ఊర్వశివో రాక్షసివో!
అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ ఆదివారం నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ వేడుకకు నందమూరి నటసింహ బాలకృష్ణ...

Bala Krishna Chief Guest for Urvasivo Rakshasivo Pre Release event
Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. ప్రేమంటే పెళ్లి అనుకునే హీరో, ప్రేమంటే కేవలం సహజీవనం చేసి ఎంజాయ్ చేయడం అనుకునే హీరోయిన్.. ఈ కథకి కామెడీని జత చేస్తూ దర్శకుడు ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాడు.
Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ..
నవంబర్ 4న విడుదలకు సిద్ధమవుతుండగా మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దీంతో ఇటీవల సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ ఆదివారం నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ వేడుకకు నందమూరి నటసింహ బాలకృష్ణ అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. గీత ఆర్ట్స్-2 పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.