Balagam Actor Died : విషాదం.. బ‌ల‌గం నటుడు కన్నుమూత

టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించి బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచిన సినిమా బ‌ల‌గం.

Balagam Actor Died : విషాదం.. బ‌ల‌గం నటుడు కన్నుమూత

Balagam Actor Died

Updated On : September 5, 2023 / 6:17 PM IST

Balagam Actor Narsingam : టాలీవుడ్‌లో చిన్న చిత్రంగా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించి బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచిన సినిమా బ‌ల‌గం (Balagam). వేణు యెల్దండి (Venu Yeldandi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కాగా.. ఈ సినిమాలో స‌ర్పంచ్ పాత్ర‌లో క‌నిపించిన న‌టుడు న‌ర్సింగం(Narsingam) క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు వేణు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

Mega 157 : చిరంజీవి, వసిష్ఠ సినిమా మొదలయ్యేది అప్పుడేనా..?

గ‌త‌కొంత‌కాలంగా న‌ర్సింగం రావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మంగ‌ళ‌వారం ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బ‌ల‌గం ద‌ర్శ‌కుడు వేణు నివాళులు అర్పించారు. “నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం.” అంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు. విష‌యం తెలుసుకున్న ప‌లువురు చిత్ర బృందంలోని స‌భ్యులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు.

Tiger Nageswara Rao : టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫస్ట్ సింగల్ రిలీజ్.. గ‌జ‌దొంగ‌నే ప్రేమలో పడేసిన..