Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ సింగల్ రిలీజ్.. గజదొంగనే ప్రేమలో పడేసిన..
రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ఎక్ ధమ్ ఎక్ ధమ్ నచ్చేసావే..

Ek Dum Ek Dum Lyrical song released from Raviteja Tiger Nageshwara Rao
Tiger Nageshwara Rao : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ని గజదొంగగా చూపిస్తూ నూతన దర్శకుడు వంశీ డైరెక్టర్ చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwara Rao). పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) ఈ మూవీలో రవితేజ సరసన నటిస్తున్నారు. జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
Varun Tej : ఫ్యామిలీతో వరుణ్ తేజ్ విదేశీ టూర్‌కి కారణం అదేనా..?
ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. “ఎక్ ధమ్ ఎక్ ధమ్ నచ్చేసావే.. ఎక్ ధమ్ ఎక్ ధమ్ ఎలాగిలా పడేసావే” అంటూ సాగే ఈ పాటకి భాస్కర భట్ల లిరిక్స్ రాయగా అనురాగ్ కులకర్ణి పాడాడు. శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఒక గజదొంగ కాలేజీ అమ్మాయిని టీజ్ చేసే సన్నివేశాలను శేఖర్ మాస్టర్ సాంగ్ లో చాలా అందంగా చూపించాడని లిరికల్ సాంగ్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి గజదొంగనే ప్రేమలో పడేసిన ఆ అమ్మాయిని, టైగర్ ప్రేమని మీరుకూడా చూసేయండి.
Peddha Kapu 1 : సెప్టెంబర్‌లోనే వచ్చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు-1.. రిలీజ్ డేట్..!
కాగా ఈ సినిమాలో రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. 1970’s లో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రవితేజ ఇప్పటి వరకు కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసింది. అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.