Akhnda 2 OTT: ఓటీటీలోకి వస్తున్న అఖండ 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ 2 మూవీ ఓటీటీ(Akhnda 2 OTT) స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది.
Balakrishna Akhanda 2 movie OTT release update
- బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ అఖండ 2
- సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి
- నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది
Akhnda 2 OTT: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది.
కానీ, సినిమాల్లో చూపించిన డివైన్ కంటెంట్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. చాలా మంది ప్రముఖుల నుంచి కూడా ఈ సినిమాకు ప్రశంసలు దక్కడం విశేషం. దాంతో, కలక్షన్స్ ఒక రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అఖండ 2(Akhnda 2 OTT) సినిమా రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ రూ.100 కోట్ల షేర్ మూవీ కావడం విశేషం.
అయితే, తాజాగా అఖండ 2 ఓటీటీ రిలీజ్ గురించి క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జనవరి 9వ తేదీ నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. మరి, డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు థియేటర్స్ లో మిక్సుడ్ టాక్ రాగా ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో భారీ సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే లాంఛనంగా మొదలయ్యింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
