AHA : అల్లు అర్జున్ – బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 2 వ‌చ్చేసింది..

ఆహా వేదిక‌గా నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షో దూసుకుపోతుంది

Balakrishna Allu Arjun Unstoppable Episode Part 2 streaming in Aha

ఆహా వేదిక‌గా నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తోంది. ఈ షోకి అల్లు అర్జున్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌త‌వారం ఈ ఎపిసోడ్ పార్ట్ 1ని విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా  పార్ట్ 2 ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతోంది.

పార్ట్ 2కి సైతం అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ పిల్ల‌లు అల్లు అయాన్‌, అల్లు అర్హ సంద‌డి చేశారు. పొడుపు కథలు అడిగారు. టంగ్ ట్విస్టర్స్ చెప్పారు. అర్హ తెలుగు పద్యం చెప్పింది. ఇక‌ బ‌న్నీ.. పుష్ప 2 సినిమా గురించి, త‌న పెళ్లి గురించి మాట్లాడారు. దేవి శ్రీ ప్ర‌సాద్‌కు కాల్ చేసి మాట్లాడారు.

పోసాని సంచలన ప్రకటన.. రాజ‌కీయాలకు గుడ్ బై

మొత్తంగా ఎపిసోడ్ ఫ‌న్ ఫుల్‌గా సాగింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా అన్‌స్టాప‌బుల్ బాలయ్య – అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ 2 చూసేయండి..