Bhagavanth Kesari : భగవంత్ కేసరి బాక్సాఫీస్ బాదుడు మొదలైంది.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
బాలయ్య భగవంత్ కేసరి ఫస్ట్ కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

Balakrishna Bhagavanth Kesari first day collections report
Bhagavanth Kesari Collections : నందమూరి బాలకృష్ణ ఈ ఏడాదిని ‘వీరసింహారెడ్డి’ సినిమాతో గ్రాండ్ గా స్టార్ చేశాడు. ఇక ఇయర్ ఎండింగ్ ని కూడా అదే రేంజ్ లో ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేసిన యాక్షన్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. కాజల్ అగర్వాల్, శ్రీలీల ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. నిన్న అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా.. థియేటర్స్ లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా కొంచెం బిన్నంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీంతో ఆడియన్స్ కి కూడా కొంచెం కొత్త అనుభూతి కలుగుతుంది. ఇక ట్రైలర్ తో మంచి హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ.. మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 65 కోట్ల వరకు జరిగిందని సమాచారం.
Also read : Leo Movie Collections : లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
దీనిబట్టి చూస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంది. కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో పాటు విజయ్ ‘లియో’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ రెండు చిత్రాలు కూడా ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మరి ఇంతటి పోటీలో భగవంత్ కేసరి 130 కోట్ల గ్రాస్ ని రాబడుతాడా..? అనేది చూడాలి. ఇక అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్యకి.. ఈ విజయం హ్యాట్రిక్ ని అందించినట్లు అయ్యింది.
భగవంత్ కేసరి విస్ఫోటనం?#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER?
Enjoy #BlockbusterDawath in cinemas now❤️?#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5
— Shine Screens (@Shine_Screens) October 20, 2023