Daaku Maharaaj : రేపే డాకు మహారాజ్ రిలీజ్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి..? వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్..

వరుసగా బాలయ్య సినిమాలు హిట్ అవ్వడం, ఈ సినిమాపై కూడా అంచనాలు ఉండటం, సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో డాకు మహారాజ్ సినిమాకు కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

Balakrishna Daaku Maharaaj Theatrical Business Details Here

Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా రేపు జనవరి 12న రిలీజ్ కాబోతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించగా బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

బాలకృష్ణ గత మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అఖండ 2, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. మూడు సినిమాలు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మంచి హిట్ అవ్వడంతో బాలయ్య ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా అదిరిపోతుందని ఊహిస్తున్నారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ సంక్రాంతి ‘గేమ్ ఛేంజర్’తో అయిపోయింది.. నెక్స్ట్ దసరా టార్గెట్?

వరుసగా బాలయ్య సినిమాలు హిట్ అవ్వడం, ఈ సినిమాపై కూడా అంచనాలు ఉండటం, సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో డాకు మహారాజ్ సినిమాకు కూడా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

టాలీవుడ్ సమాచారం ప్రకారం డాకు మహారాజ్ సినిమాకు.. నైజాంలో 17.50 కోట్లు, సీడెడ్ లో 15.50 కోట్లు, ఆంధ్రాలో 34 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 5.40 కోట్లు, ఓవర్సీస్ లో 8 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే మొత్తంగా డాకు మహారాజ్ సినిమాకు ఆల్మోస్ట్ 80 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన డాకు మహారాజ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 82 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే కనీసం 160 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి.

Also Read : Ram Charan – TN Seshan : ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ పాత్ర.. రియల్ లైఫ్ లో ఆ ఆఫీసర్ లైఫ్ స్టోరీనా?

సినిమా మీద మంచి హైప్ ఉంది, సంక్రాంతి హాలీడేస్ ఉన్నాయి కాబట్టి డాకు మహారాజ్ 160 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అవుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి డాకు మహారాజ్ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తుందో.