Balakrishna : కేంద్రాన్ని అభ్యర్దిస్తున్నా, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలి.. శతజయంతి సభలో బాలకృష్ణ

హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో జరిగిన శత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ.. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలి అంటూ..

Balakrishna demands Bharat Ratna to senior ntr at 100 years of NTR function

Balakrishna : నందమూరి తారక రామారావు శత జయంతిని (100 years of NTR) గత ఏడాది నుంచి నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విజయవాడలో జరిగిన అంకురార్పణ సభ దగ్గర నుంచి బాలకృష్ణ కూడా ఈ శత జయంతి ఉత్సవాల్లో నేరుగా పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారంలో ఖతార్ లోని దోహాలో జరిగిన శత జయంతికి ముఖ్య అతిథిగా హాజరయ్యి, స్టేజి పై పాట పాడి మరి అభిమానులను ఉత్సాహపరిచారు. తాజాగా హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో జరిగిన శత జయంతి కార్యక్రమానికి కూడా గెస్ట్ గా వెళ్ళారు.

Balakrishna : శివశంకరి శివానంద లహరి.. స్టేజి పై బాలయ్య పాట వైరల్!

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్టీఆర్ శత జయంతి సభ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగుదేశం నేతలు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “మీ అభిమానానికి మించింది నాకు ఏదీ లేదు. నాన్నగారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథి అంటున్నారు గాని నేను అతిథిని కాదు. నేను మీలా టీడీపీ కార్యకర్తనే.. అలాంటప్పుడు నేను ఎలా అతిథిని అవుతాను” అంటూ చెప్పుకొచ్చాడు.

NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?

ఇక ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలంటూ మరోసారి ఈ శత జయంతి వేడుకగా కోరారు. “కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నా. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చితీరాలి” అంటూ పేర్కొన్నారు. అలాగే కార్యకర్తలకు.. రాబోయే ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలి అంటూ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు చెప్పుకునే ఇప్పటికి అందరూ ఆదికారంలోకి వస్తున్నారని కార్యకర్తలకు గుర్తు చేశారు. కాగా మే 28న శత జయంతిని ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.