Balakrishna : మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వంపై బాలయ్య ఫైర్..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడంపై బాలకృష్ణ ఫైర్ అవుతూ.. ''మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి.................

Balakrishna : మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది కేవలం పేరు మాత్రమే కాదు.. ఏపీ ప్రభుత్వంపై బాలయ్య ఫైర్..

Balakrishna fires on AP Government regarding NTR Health University Name Change

Updated On : September 24, 2022 / 11:10 AM IST

Balakrishna :  ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి “వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల దగ్గర నుంచి సాధారణ ఓటర్ల వరకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ చాలా మంది స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా దీనిపై ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ అంశంపై స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

NTR Health University row: పేర్లు మార్చాలని అనుకుంటే ఈ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా?: పవన్ కల్యాణ్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపెట్టడంపై బాలకృష్ణ ఫైర్ అవుతూ.. ”మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారు. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు” అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.