Balakrishna NBK 110 Movie Poster Goes Viral
NBK 110 Movie : బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్ల హ్యాట్రిక్ విజయం సాధించారు. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. మంచి లైనప్ తో యువ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇస్తూ బాలకృష్ణ దూసుకుపోతున్నారు. ఇటీవల NBK108 సినిమాగా భగవంత్ కేసరి వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
NBK 109 సినిమా బాబీ దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత బాలయ్య నెక్స్ట్ సినిమా NBK 110 ఇంకా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాలకృష్ణ 110వ సినిమా అని ఒక పోస్టర్ వైరల్ గా మారింది.
Also Read : Venkatesh : 26 ఏళ్ళ క్రితం వచ్చిన తన సూపర్ హిట్ సాంగ్‌కి.. డ్యాన్స్ వేసిన వెంకటేష్..
బాలయ్య యుద్ధంలో ఉండే ఒక రాజు గెటప్ లో సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్టు ఈ పోస్టర్ లో కనపడుతున్నారు. పోస్టర్ పై బాలయ్య 110 అని వేసి #BattleofBreaths అనే హ్యాష్ ట్యాగ్ కూడా వేశారు. అంతకుముందెప్పుడు కనపడని రోల్ లో మన NBK కనపడబోతున్నారు అని ఈ పోస్టర్ ని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అధికారికంగా ఎక్కడా బాలకృష్ణ 110 వ సినిమా ప్రకటించలేదు. మరి ఈ పోస్టర్ కథేంటి, ఎందుకు వైరల్ చేస్తున్నారు, ఇది అభిమానులు చేసిన పోస్టరా అనేది తెలియాల్సి ఉంది.
కొత్త పోస్టర్ కేక పుట్టిస్తోంది, ఎలాంటి సినిమానో తెలీదు కానీ,
మిగిలిన విషయాల కోసం వెయిట్ చెయ్యలేకపోతున్నాం.!!#BattleOfBreaths pic.twitter.com/kBeTXr90nt
— Ramesh Bala (@rameshlaus) November 4, 2023
ఇంతకముందర ఎప్పుడూ చూడని రోల్ లో మన లెజెండరీ NBK ?#BattleOfBreaths కోసం ఇక వెయిట్ చేయలేం ? pic.twitter.com/1r0tbsooLL
— Sailendra Medarametla (@sailendramedar2) November 4, 2023
ఇంతకముందర ఎప్పుడూ చూడని రోల్ లో మన లెజెండరీ NBK ?#BattleOfBreaths కోసం ఇక వెయిట్ చేయలేం ? pic.twitter.com/7NzuUmgkVh
— Balayya Yuvasena (@BalayyaUvasena) November 4, 2023