Balakrishna: బాలయ్య ఓపెన్ ఆఫర్స్.. అందుకొనే దర్శకులెవరో?
బాలకృష్ణ.. అఖండ సక్సెస్ తో మాంచి ఊపుమీదున్నారు. ఈమధ్య కెరీర్ లో ప్రయోగాలకు రెడీ అయిన బాలయ్య.. ఆల్రెడీ కొత్త కాంబినేషన్స్ ని సెట్ చేసుకుని ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు.
Balakrishna: బాలకృష్ణ.. అఖండ సక్సెస్ తో మాంచి ఊపుమీదున్నారు. ఈమధ్య కెరీర్ లో ప్రయోగాలకు రెడీ అయిన బాలయ్య.. ఆల్రెడీ కొత్త కాంబినేషన్స్ ని సెట్ చేసుకుని ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు. అఖండ సక్సెస్ తో క్లౌడ్ నైన్ లో ఉన్న బాలయ్య.. అదే ఎనర్జీతో సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ అన్ స్టాపబుల్ తో అదిరిపోయే ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్న ఈ సీనియర్ హీరో ..తనతో సినిమాలు చెయ్యడానికి డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా సుకుమార్ తో, రాజమౌళితో సినిమా ఇంట్రస్ట్ ని చూపిస్తూ.. నేను ఎవరితో అయినా సినిమాలు చెయ్యడానికి రెడీ అంటున్నారు.
Bigg Boss 5 Winner: సన్నీ మ్యారేజ్ ప్రపోజల్.. రూ.100 కోట్ల కట్నం!
ఇప్పటికే రాజమౌళితో నాతో సినిమా ఎందుకు చెయ్యడం లేదని పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ మీదే అడిగి షాక్ ఇచ్చారు బాలయ్య. మొన్నీమధ్య రాజమౌళితో తనతో సినిమా చెయ్యమని అడిగిన బాలకృష్ణ లేటెస్ట్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి సినిమా ఆఫర్ ఇచ్చారు. అందరితో సినిమాలు చేస్తావు.. నాతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అంటూ ఆటపట్టించారు. అంతేకాదు.. సినిమా స్టార్ట్ చేస్తే జస్ట్ 3 నెలల్లోనే బొమ్మ పడాల్సిందే అంటూ సుక్కుతో తన సినిమా ఇంట్రస్ట్ ని చెప్పారు.
RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
ఈ క్రేజీ డైరెక్టర్లతో సినిమాలే కాకుండా తన 107 సినిమాని యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో స్పెషలిస్ట్ అయిన గోపీచంద్ మలినేనితో చేస్తున్న బాలయ్య.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావల్సిందే అంటూ గోపీచంద్ కి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిల్ రావిపూడి, పూరీజగన్ తో ఆల్రెడీ క్రేజీకాంబినేషన్స్ సెట్ చేసుకున్న బాలయ్య.. స్టోరీ దొరికితే విలన్ గా చెయ్యడానికైనా రెడీ అంటూనే.. మాంచి సబ్జెక్ట్ దొరికితే మల్టీస్టారర్ కి కూడా రెడీ అంటూ డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ సోలోగా సేఫ్ గేమ్ ఆడిన బాలయ్య.. ఇప్పుడు ఎక్స్ పెరిమెంట్స్ కి రెడీ అవుతూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు.