Veera Simha Reddy : సినిమా విషయంలో నేనొక సలహా ఇచ్చా.. ఇవాళ అదే హైలైట్ అయ్యింది.. బాలకృష్ణ!

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇక మొదటి షో తోనే హిట్టు టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ, సినిమా కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

Veera Simha Reddy : సినిమా విషయంలో నేనొక సలహా ఇచ్చా.. ఇవాళ అదే హైలైట్ అయ్యింది.. బాలకృష్ణ!

Veera Simha Reddy

Updated On : January 13, 2023 / 10:57 AM IST

Veera Simha Reddy : నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. నిన్న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక మొదటి షో తోనే హిట్టు టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, ఫైట్ మాస్టర్స్, డైరెక్టర్ గోపీచంద్, వరలక్ష్మి శరత్ కుమార్, బాలకృష్ణ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ, సినిమా కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ గ్యాలరీ..

బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘అఖండ లాంటి భారీ విజయం తరువాత ఎటువంటి సినిమా తీయాలి అనుకుంటున్న సమయంలో దర్శకుడు గోపి నాకు ఈ కథ చెప్పాడు, కరెక్ట్ సినిమా అని ఒకే చెప్పేశాను. అందరూ ఇది ఫ్యాక్షన్, మాస్ మసాలా కథ అనుకుంటున్నారు. కానీ ఇది అన్నచెల్లెల సెంటిమెంట్ ఉన్న చిత్రం. దర్శకుడు, నాకు చెల్లి పాత్ర గురించి చెప్పినప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను. ఆ క్యారెక్టర్ గురించి సస్పెన్స్ మెయిన్‌టైన్ చేద్దాం అని చెప్పను. ఇవాళ ఆ పాయింట్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. సిస్టర్ సెంటిమెంట్ కి ఆడవాళ్ళతో పాటు మొగవాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నవరసాలు సమపాలనలో ఉన్న సినిమా వీరసింహారెడ్డి’ అంటూ వెల్లడించాడు.

‘అలాగే ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు’ అంటూ తెలియజేశాడు. కాగా ఈ సినిమాని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మలయాళ నటి హనీ రోజ్ బాలయ్య సరసన మరో కథానాయకిగా బలమైన పాత్రలో కనిపించింది. ఇక కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్స్ చేశారు. సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. బాలకృష్ణ కెరీర్ లోనే వీరసింహారెడ్డి బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు చెబుతున్నారు.