Balakrishna says his Favorite Heroins names in Nara Nandamuri Party
Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు అభినందనలు తెలియచేసారు. ఈ క్రమంలో బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నారా భవనేశ్వరి నారా – నందమూరి కుటుంబాలకు ఓ స్పెషల్ పార్టీ అరేంజ్ చేశారు.
ఈ పార్టీకి నారా – నందమూరి కుటుంబాలు అందరూ ఫ్యామిలీలతో వచ్చారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో బాలకృష్ణని స్టేజిపై కూర్చోపెట్టి ఆయన సోదరీమణులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, మరో సోదరి కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ అంతా సరదాగా సాగింది. ఈ ఇంటర్వ్యూలో బాలయ్యని సరదా ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఫేవరేట్ హీరోయిన్స్ గురించి అడిగారు.
Also Read : Bunny Vasu : మళ్ళీ జనసేన నుంచి పోటీ గురించి మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. పవన్ గారి దగ్గర అలా పనిచేస్తే..
నీతో పనిచేసిన వాళ్ళల్లో నీకు బాగా నచ్చిన హీరోయిన్స్ ఎవరు అని అడిగారు భువనేశ్వరి, పురంధేశ్వరి. ఆ ఈవెంట్లో బాలయ్య సతీమణి వసుంధర కూడా ఉన్నారు. మొదట బాలయ్య.. నా ఫేవరేట్ హీరోయిన్ నా భార్యే అని కాసేపు ఆటపట్టించారు. దీంతో బాలయ్య అక్కాచెల్లెళ్లు ఒప్పుకోలేదు. సినిమాల్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు చెప్పు అనడంతో బాలయ్య.. మొదట విజయశాంతి, ఆ తర్వాత రమ్యకృష్ణ, ఆ తర్వాత సిమ్రాన్ అని తెలిపారు. దీంతో బాలయ్య ఫేవరేట్ హీరోయిన్స్ ఈ ముగ్గురే అని తెగ వైరల్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు.
ఈ ముగ్గురు హీరోయిన్స్ తోనూ బాలయ్య పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టాడు. విజయశాంతితో బాలయ్య లారీ డ్రైవర్, ముద్దుల మామయ్య, రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పు రవ్వ, మువ్వ గోపాలుడు.. ఇలా చాలా సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇక రమ్యకృష్ణతో బంగారు బుల్లోడు, వంశానికొక్కడు, వంశోద్ధారకుడు, దేవుడు సినిమాల్లో కలిసి నటించాడు బాలయ్య. ఇక సిమ్రాన్ తో సమరసింహారెడ్డి, గొప్పింటి అల్లుడు, నరసింహ నాయుడు, సీమ సింహం.. పలు సినిమాల్లో కలిసి నటించారు. మొత్తానికి ఈ పార్టీ వల్ల బాలయ్య ఫేవరేట్ హీరోయిన్స్ ఎవరో తెలిసిపోయింది.