balakrishna share his dream project to fans
Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి గోపాల్ వచ్చాడు. బాలయ్యకి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్టులు అందించాడు ఈ దర్శకుడు.
Veera Simha Reddy : ఏపీలో హీట్ పుట్టిస్తున్న వీరసింహారెడ్డి పొలిటికల్ డైలాగ్స్..
బాలయ్య మాట్లాడుతూ.. ఈరోజు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన దర్శకుడు, మా కుటుంబ సభ్యుడు బి గోపాల్ గారికి కృతజ్ఞతలు. అయన నాకు అందించిన సినిమాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు. ఈ సభకి ఎవర్ని ముఖ్య అతిధిగా పిలిస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. ఈ వీరసింహారెడ్డి వేదికకు ఎవరన్నా పెద్దరికం తీసుకువచ్చే వారు ఉన్నారు అంటే అది బి గోపాల్ గారు మాత్రమే. ఆయన్ని పిలుదాం అని చెప్పా. అయన కూడా ఒంగోలియనే.
“ఒంగోలియన్ అంటే గుర్తుకు వచ్చింది. నాకు మంగోలియన్ అయిన చెంఘీజ్ ఖాన్ పాత్రలో నటించాలి అని ఉంది. చెంఘీజ్ ఖాన్ సినిమా చేదాం అనేది నా జీవిత ఆశయం. ఎప్పటికైనా చేస్తా. దేనికైనా సమయం రావాలి అంతే” అంటూ తన డ్రీం ప్రాజెక్ట్ గురించి అభిమానులకు తెలియజేశాడు. కాగా నిన్న ఈ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ ఫ్యాక్షన్ యాక్షన్ తో బాంబులు పిలుస్తూనే, పొలిటికల్ సెటైర్‌లు కూడా పేల్చాడు. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమాని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.