రూలర్: రైతు డైలాగ్‌తో అదరగొట్టిన బాలయ్య

రూలర్: రైతు డైలాగ్‌తో  అదరగొట్టిన బాలయ్య

Updated On : December 14, 2019 / 3:45 PM IST

విశాఖపట్నం వేదికగా జరిగిన రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి నటసింహం అద్భుతమైన స్పీచ్‌తో అదరగొట్టారు. 

ఆపద్భాందవులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, కళాభిమనాలు, కళాపోషకులైన నా అభిమానులకు పాత్రికేయ మిత్రులకు, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో జరుగుతున్న రూలర్ చిత్రం ప్రీ రిలీజ్ లాంచ్ విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు, టీవీల్లో చూసేవారందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నాను 
* మన మరదలు జీవితా రాజశేఖర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
* ఉదయం దారాలమ్మ గుడికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నా. 
* సినిమా వాళ్లతో పాటు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నా. 
* పుణ్య దంపతులకు పుట్టినందుకు ధన్యవాదాలు. 
* కళామతల్లికి సేవలందింస్తున్నందుకు కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. 
* మీరిచ్చిన స్ఫూర్తితో, ఆదరణతోనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నాం. మీరు వెన్నుతట్టి * ప్రోత్సహిన్నందునే సినిమాలు చేయగలుగుతున్నాం. 
* ముందు ఒక కథనుకున్నాం. పరుచూరికి ఫోన్ చేయడంతోనే వెంటనే  వచ్చి కథ చెప్పారు. 
* నేనందరితో ఇమడలేను. కారణం మీ అంచనాలకు అనుగుణంగా సినిమా తీయాలనే. 
* ప్రయత్నాలు  చేస్తూనే ఉంటా. వెనుకడగేయబోయను. 
ఎవడి మీదరా చెయ్యివేశావ్. రైతు మీదా. 
బోషడీకె. మనం వాడే సెల్ ఫోన్ లేకుండా మనం ఉండగలం.
దానిని కనిపెట్టిన వాడు కోటీశ్వరుడు. మనం తాగే మందు తయారుచేసేవాడు కూడా కోటీశ్వరుడు. కాల్చే బీడీలు లేకుండా బతకగలం. కానీ, అవి తయారుచేసేవాడు కూడా కోటీశ్వరుడు. మనం తింటున్నామే అన్నం. అది లేకుండా మనం బతకగలమా.. బతకలేం కదా.. అటువంటి రైతులు మనదేశంలో బిచ్చగాళ్లలా బతుకుతున్నారు. 

* రైతు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉండేది.ఇందులోనూ అదే చూపించాం. 
* నాలుగు నెలల్లో చిత్రం పూర్తి చేశాం. పాత్రల్లో వైవిధ్యం చూపించాం. 
* వైజాగ్ కు నాకు చాలా అనుబంధం ఉంది. వైజాగ్ లో నేను తీసిన సినిమాలు ఏ హీరో చేయలేదు. 
* కెమెరామెన్, డైరక్టర్ భార్యభర్తలు లాంటి వారు. వారిద్దరి మధ్య అవగాహనే సినిమాను చక్కగా వచ్చేలా చేస్తుంది. 
* అందరూ నటీనటులు నవరత్నాలు పొదిగినట్లుగా సినిమాలో చక్కగా కుదిరారు. 
* పాటలు రాసిన వారికి, గాయనీగాయకులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 

దుర్గమారాణ్యాలు దున్నాను. 
బీడు భూముల్లో పాటుపడ్డాను.
ఏడాది పొడుగునా గాలికి చిక్కాను. 
దుమ్ముధూళికి, ఈదురుగాలుల తట్టుకున్నాను.
రాళ్లు రప్పలను దాటాను. ముల్లడొంకల్లో సేదతీరాను. 

తెలుగు రైతుల ఔన్నత్యాన్ని చెప్పే సినిమానే రూలర్. 

ఈ సినిమా 20న వచ్చి మీ అందరికీ వినోదాన్ని అందిస్తుందని చెప్తున్నాను. సినిమా నాడి తెలిసిపోయింది ఇది సూపర్ హిట్. బోయపాటితో మరో సినిమా సిద్ధం చేస్తున్నాం.