Balakrishna : బాలయ్య బిగ్ డెసిషన్.. కెరీర్ లోనే ఫస్ట్ టైమ్..
ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా చేస్తూ అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తోన్న బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ప్యారలల్‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Balakrishna Upcoming Movies Updates
ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా చేస్తూ అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తోన్న బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ప్యారలల్‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా తనకి గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్‌తో.
కెరీర్‌లో ఇప్పటివరకు ఒకేసారి రెండు సినిమాల్ని టేకప్ చేయని బాలకృష్ణ.. ఇప్పుడు రూట్ మార్చబోతున్నారు. ప్యారలెల్‌గా రెండు భారీ సినిమాల్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఈ నందమూరి నటసింహం. ప్రజెంట్ బోయపాటి డైరెక్షన్‌లో అఖండకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న అఖండ 2 తాండవం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు బాలకృష్ణ. దసరా బాక్సాఫీస్ బరిలో దిగేందుకు రెడీ అవుతోంది అఖండ 2. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే.. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌తో పాటు క్రిష్ ప్రాజెక్ట్‌ని ప్యారలెల్‌గా టేకప్ చేయాలని డిసైడ్ అయ్యారట బాలయ్య.
అఖండ తాండవం సినిమా పూర్తికాగానే డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌లో జాయన్ అవుతారు బాలకృష్ణ. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి.. 2023 సంక్రాంతి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఎగ్జైట్ అవుతున్నారు నందమూరి అభిమానులు. సినిమా అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన పోస్టర్ క్యూరియాసిటీ పెంచేసింది. NBK111 వర్కింగ్ టైటిల్‌గా ఈ సినిమాని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని పీరియాడిక్ సినిమాతో పాటు తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్‌తో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు బాలయ్య. ఆదిత్య 369కి సీక్వెల్‌గా తెరకెక్కబోయే ఈ సినిమాని ఆదిత్య 999గా గతంలోనే అనౌన్స్ చేశారు నటసింహం. సినిమాకి సంబంధించిన స్కిప్ట్ వర్క్ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా డైరెక్టర్ క్రిష్‌తో స్టోరీ డిస్కషన్స్ చేసిన బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆదిత్య 999పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇలా తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్‌తో 2 భారీ సినిమాల్ని ప్యారలల్‌గా చేసేందుకు బాలయ్య రెడీ అవ్వడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు