Unstoppable with NBK: బాలయ్య టాక్ షో.. మహేష్‌తో లాస్ట్ ఎపిసోడ్

ఆయన నట సింహం.. మాటల్లో ఫిల్టర్ ఉండదు. అలాంటి వ్యక్తి ఒక టాక్ షో చేస్తే ఎదుటివాళ్ళు కూర్చోగలరా.. కోపమొస్తే ఎదుట ఉంది ఎవరన్నది చూడకుండా తిట్టేస్తాడు.. అలాంటి వ్యక్తి టాక్ షో..

Unstoppable with NBK: బాలయ్య టాక్ షో.. మహేష్‌తో లాస్ట్ ఎపిసోడ్

Unstoppable With Nbk

Updated On : December 22, 2021 / 5:22 PM IST

Unstoppable with NBK: ఆయన నట సింహం.. మాటల్లో ఫిల్టర్ ఉండదు. అలాంటి వ్యక్తి ఒక టాక్ షో చేస్తే ఎదుటివాళ్ళు కూర్చోగలరా.. కోపమొస్తే ఎదుట ఉంది ఎవరన్నది చూడకుండా తిట్టేస్తాడు.. అలాంటి వ్యక్తి టాక్ షో నడిపిస్తే సక్సెస్ అవుతుందా.. ఆయన మాస్ కే మాస్ హీరో.. అలాంటి వ్యక్తి ముందు ఇప్పుడిప్పుడే ఎదిగే యంగ్ హీరోలు ఓపెన్ గా మాట్లాడగలరా.. ఇది ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో మొదలైనపుడు కొందరు తెలుగు ప్రేక్షకుల నుండి వినిపించిన మాట. కానీ.. బాలయ్య ఆ అనుమానాలను పటాపంచెలు చేస్తూ టాక్ షో అంటే ఇలా ఉండాలనేలా నిరూపించాడు.

Republic 2: పవర్ స్టార్ హీరోగా మేనల్లుడి సినిమాకు సీక్వెల్?

షోలో ఎదురు కూర్చున్న వాళ్ళని బట్టి వారి వయసుకు తగ్గట్లే హుందాగా ఉంటూనే తనదైన కామెడీ టైమింగ్ తో నెవెర్ బిఫోర్ అనేలా అన్ స్టాపబుల్ షోను సూపర్ డూపర్ సక్సెస్ చేశాడు బాలయ్య. అయితే.. ఎంత సక్సెస్ ఫుల్ షో అయినా ఎండ్ కార్డ్ ఉండాలి కదా.. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ఈ సీజన్ ఎండ్ కార్డ్ పడాల్సిన సమయం వచ్చేసింది. ఈ సీజన్ ఓ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ తో ముగించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆహా ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించేసింది.

Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే

సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాలయ్య ఓ బ్లాక్ బస్టర్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందా అని అటు ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ తోనే ఈ సీజన్ అన్ స్టాపబుల్ టాక్ షోను ముగించేయనున్నారు. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఇదే అంటూ ఆహా సోషల్ మీడియాలో ప్రకటించేసింది.